...ఇకపై ఆమెకూ మెటర్నిటీ లీవు!
మహారాష్ట్ర ప్రభుత్వం సరోగసీ తల్లి ద్వారా బిడ్డను పొందిన మహిళల విషయంలో ఒక మంచి నిర్ణయం తీసుకుంది. తాము ప్రసవించకపోయినా మరొక మహిళ గర్భం ద్వారా పుట్టిన బిడ్డకు తల్లి అయిన మహిళలకు ప్రభుత్వం ఇకపై180 రోజుల మెటర్నటీ లీవుని మంజూరు చేయనుంది. మనదేశంలో ఇలాంటి నిర్ణయం తీసుకున్న మొట్టమొదటి రాష్ట్రం మహారాష్ట్రయే. అయితే లీవుకోసం ఆ మహిళా ఉద్యోగి ముందుగానే అప్లయి చేయాల్సి ఉంటుంది. అలాగే సరోగసీ తల్లి ద్వారా తన బిడ్డను పొందడానికి కుదుర్చుకున్న […]
మహారాష్ట్ర ప్రభుత్వం సరోగసీ తల్లి ద్వారా బిడ్డను పొందిన మహిళల విషయంలో ఒక మంచి నిర్ణయం తీసుకుంది. తాము ప్రసవించకపోయినా మరొక మహిళ గర్భం ద్వారా పుట్టిన బిడ్డకు తల్లి అయిన మహిళలకు ప్రభుత్వం ఇకపై180 రోజుల మెటర్నటీ లీవుని మంజూరు చేయనుంది. మనదేశంలో ఇలాంటి నిర్ణయం తీసుకున్న మొట్టమొదటి రాష్ట్రం మహారాష్ట్రయే. అయితే లీవుకోసం ఆ మహిళా ఉద్యోగి ముందుగానే అప్లయి చేయాల్సి ఉంటుంది. అలాగే సరోగసీ తల్లి ద్వారా తన బిడ్డను పొందడానికి కుదుర్చుకున్న ఒప్పందం తాలూకూ పత్రాలను సైతం లీవు అప్లికేషన్‌తో పాటు సబ్మిట్ చేయవలసి ఉంటుంది. అంతేకాదు, ఇండియన్ మెడికల్ రీసెర్చి కౌన్సిల్ ఆమోదించిన విధానంలోనే, చట్టబద్ధంగా సరోగసీ బిడ్డను పొందినట్టుగా తెలిపే పత్రాలను సైతం లీవు అప్లికేషనుతో పాటు సమర్పించాల్సి ఉంటుంది. సరోగసీ బిడ్డని పొందిన మహిళా ఉద్యోగి, తాను బిడ్డకు జన్మను ఇవ్వకపోయినా, ఆ బిడ్డ ఆలనాపాలనా చూసుకోవాల్సిన అవసరం ఉంటుందని, ఆ బిడ్డతో ఆమె అనుబంధం బలపడాల్సి ఉంటుందని సంబంధింత ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. బిడ్డ పుట్టిన రోజు నుండి లీవుని వినియోగించుకోవచ్చు.
గత కొన్ని సంవత్సరాలుగా, సరోగసీ తల్లి ద్వారా బిడ్డను పొందిన మహిళలు ప్రభుత్వ ఉద్యోగులు అయితే మెటర్నటీ లీవుని పొందవచ్చని చెబుతూ పలు కోర్టు తీర్పులు వెలువడ్డాయి. ఇప్పుడిది చట్టరూపంలోకి రానుంది. గత ఏడాది ఆగస్టులో ముంబై కోర్టుకి చెందిన నాగపూర్ ధర్మాసనం ఇలాంటి తీర్పునే ఇచ్చింది. గత సంవత్సరం ఢిల్లీ హైకోర్టు సైతం ఇలాంటి తీర్పుని ఇచ్చింది. అయితే దీన్ని మొట్టమొదటి సారి అమలు చేస్తున్న ఘనతని మాత్రం మహారాష్ట్ర ప్రభుత్వం దక్కించుకుంది.
ఇప్పటివరకు గర్భిణులకు 180 రోజులు, బిడ్డని దత్తత తీసుకున్న మహిళకు 90 రోజులు ప్రభుత్వ సెలవులు అందుబాటులో ఉండగా, ఇప్పుడు సరోగసీ విధానంలో తాను కనని తన బిడ్డకి తల్లయిన మహిళలకు సైతం 180 రోజుల మెటర్నటీ లీవుని మంజూరు చేస్తారు. అయితే ఇలాంటి లీవుని మహిళా ఉద్యోగి తన మొత్తం సర్వీసు కాలంలో ఒక్కసారి మాత్రమే వినియోగించుకోగలుతుంది. అలాగే ఆమెకు ఇంతకుముందు బిడ్డలు ఉండకూడదు. అలా అయితేనే ఈ లీవుకి అర్హురాలు అవుతుంది. రాష్ట ప్రభుత్వ విద్యాసంస్థలు, యూనివర్శిటీల్లో పనిచేసే మహిళలకు సైతం ఈ చట్టం వర్తిస్తుంది.