అమ్మానాన్నను శిక్షించే సెక్షన్లు లేవా?

భార్యకు కడపుచేసినంత మాత్రనా మొగాడయిపోతాడా?. బిడ్డకు జన్మనిచ్చినంత మాత్రనా అమ్మ అయిపోతుందా?. కానే కాదు  పిల్లలను కనడమే తల్లిదండ్రుల హోదాకు అర్హత అంటే ఆ పని జంతువులు (సారీ… పిల్లలకు ఆపదొస్తే జంతువులు కూడా ప్రాణాలకు తెగించి శత్రవులతో పోరాడుతాయి) కూడా చేస్తాయి. తండ్రన్నాక బిడ్డకు రక్షణగా ఉండాలి… అమ్మన్నాక పిల్లలకు కంటికి రెప్పలా ఉండాలి. ఎంత కష్టమొచ్చినా సరే.  కానీ కడప జిల్లాలో ఒక జంట మాత్రం తమకు సెంటిమెంట్లు లేవని నిరూపించింది. వారిద్దరి మధ్య గొడవకు కన్నబిడ్డను కోర్టులో వదిలేసి వెళ్లారు. పసిపాప […]

Advertisement
Update:2016-01-22 04:45 IST

భార్యకు కడపుచేసినంత మాత్రనా మొగాడయిపోతాడా?. బిడ్డకు జన్మనిచ్చినంత మాత్రనా అమ్మ అయిపోతుందా?. కానే కాదు పిల్లలను కనడమే తల్లిదండ్రుల హోదాకు అర్హత అంటే ఆ పని జంతువులు (సారీ… పిల్లలకు ఆపదొస్తే జంతువులు కూడా ప్రాణాలకు తెగించి శత్రవులతో పోరాడుతాయి) కూడా చేస్తాయి. తండ్రన్నాక బిడ్డకు రక్షణగా ఉండాలి… అమ్మన్నాక పిల్లలకు కంటికి రెప్పలా ఉండాలి. ఎంత కష్టమొచ్చినా సరే. కానీ కడప జిల్లాలో ఒక జంట మాత్రం తమకు సెంటిమెంట్లు లేవని నిరూపించింది. వారిద్దరి మధ్య గొడవకు కన్నబిడ్డను కోర్టులో వదిలేసి వెళ్లారు. పసిపాప వెక్కివెక్కి ఏడుస్తున్నా వారు కనికరించలేదు. ఈ ఘటన కడపలో జరిగింది.

కడప నగరానికి చెందిన ఈశ్వర్, విజయభారతి భార్యభర్తలు. వీరికి కీర్తి అనే ఏడాదిన్నర పాప ఉంది. అయితే 2014లో ఈశ్వర్‌పై విజయభారతి వరకట్నవేధింపుల కేసు పెట్టింది. అప్పటి నుంచి వేరువేరుగా ఉంటున్నారు. పాప తల్లి దగ్గరే ఉంటోంది. కేసును విచారించిన న్యాయమూర్తి … విజయభారతికి నెలకు రూ. 3500 చొప్పున జీవనభృతి చెల్లించాలని ఈశ్వర్‌ను ఆదేశించారు. అయితే ఆ మొత్తం తనకు సరిపోదంటూ కుమార్తెను కోర్టులోనే వదిలేసి వెళ్లిపోయింది ఆ సోకాల్డ్ తల్లి. తండ్రి కూడా కీర్తిని అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు. చాలాసేపు చిన్నారి అక్కడే ఏడుస్తూ కూర్చుంది. చిన్నారిని చూసి అక్కడున్న వారి మనసు కరిగిపోయింది. చివరకు న్యాయమూర్తే స్పందించారు. చిన్నారిని తీసుకెళ్లి శిశుసంరక్షణ కేంద్రంలో చేర్చారు.

Tags:    
Advertisement

Similar News