సింగపూర్‌ భేటీకి జనవరి 31కి లింక్‌ ఉందా?

చంద్రబాబు విదేశాలకు వెళ్తే ఆ పర్యటన షెడ్యూల్ చాలా రోజుల ముందే సిద్ధమవుతుంది. ప్రస్తుతం చంద్రబాబు చేస్తున్న దావోస్ పర్యటనకు సంబంధించి కూడా షెడ్యూల్ చాలా రోజుల క్రితమే సిద్ధమైంది. కానీ దావోస్‌ నుంచి హఠాత్తుగా సింగపూర్ వెళ్లాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. సరే పనిలో పనిగా దావోస్ నుంచి తనకు ఇష్టమైన సింగపూర్‌ను కూడా ఒక లుక్ వేసేందుకు వెళ్తున్నారని అనుకున్నారు. కానీ బాబు సింగపూర్‌ టూర్ ప్రకటన వెలువడిన సమయంలో అప్పటి వరకు బిజీగా సాగుతున్న […]

Advertisement
Update:2016-01-21 06:47 IST

చంద్రబాబు విదేశాలకు వెళ్తే ఆ పర్యటన షెడ్యూల్ చాలా రోజుల ముందే సిద్ధమవుతుంది. ప్రస్తుతం చంద్రబాబు చేస్తున్న దావోస్ పర్యటనకు సంబంధించి కూడా షెడ్యూల్ చాలా రోజుల క్రితమే సిద్ధమైంది. కానీ దావోస్‌ నుంచి హఠాత్తుగా సింగపూర్ వెళ్లాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. సరే పనిలో పనిగా దావోస్ నుంచి తనకు ఇష్టమైన సింగపూర్‌ను కూడా ఒక లుక్ వేసేందుకు వెళ్తున్నారని అనుకున్నారు. కానీ బాబు సింగపూర్‌ టూర్ ప్రకటన వెలువడిన సమయంలో అప్పటి వరకు బిజీగా సాగుతున్న సర్ధార్ షూటింగ్‌కు పవన్ ప్యాకప్ చెప్పేశారు. చిన్న గాయం కారణంగా పవన్ రెస్ట్ తీసుకుంటున్నారని అంటున్నారు.

మరికొందరు సింగపూర్‌లో చంద్రబాబు, పవన్ కల్యాణ్ సమావేశమవుతున్నారని చెప్పుకుంటున్నారు. రాష్ట్ర రాజకీయాలపై చర్చిస్తారట అయితే వీరి భేటిపై ఇప్పటికీ అధికారిక స్పందన లేదు. పవన్ సింగపూర్ వెళ్లారని చెబుతున్నా దాన్ని ధృవీకరించే వారు కూడా లేరు. పవన్ సింగపూర్ వెళ్తే చంద్రబాబుతో రహస్యంగా చర్చించేఅవకాశం ఉందని చెబుతున్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల గురించి చర్చిస్తారని కొందరు నేతలు పైకి చెబుతున్నా అసలు కారణం జనవరి 31 అయి ఉండవచ్చంటున్నారు. ఈనెల 31న తునిలో భారీ స్థాయిలో కాపు గర్జన నిర్వహించేందుకు కాపులు సిద్ధమవుతున్నారు. చంద్రబాబు తీరుకు వ్యతిరేకంగానే ఈ సభ నిర్వహిస్తున్నారు. సభను నిర్వహిస్తున్న ముద్రగడ ఇటీవల చంద్రబాబుకు ఘాటైన లేఖ కూడా రాశారు. కాపు సభను అడ్డుకునేందుకు కుట్ర చేస్తున్నారని లేఖలో ఆరోపించారు. చంద్రబాబు జాతిపెద్దలు కాపు జాతిని నాశనం చేసేందుకు ప్రయత్నిస్తోందంటూ బహిరంగ లేఖ రాసి కలకలం సృష్టించారు. ఈనేపథ్యంలో పవన్‌ను చంద్రబాబు కలుస్తున్నారని చెబుతున్నారు . కాపులను శాంతపరిచేందుకు, కాపులకు తాను అధిక ప్రాధాన్యత ఇస్తున్నానన్న భావన కలిగించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని భావిస్తున్నారు. అయితే పవన్, చంద్రబాబు భేటీ నిజంగా జరిగితే ఆలస్యంగానైనా బయటకు పొక్కవచ్చు.

Tags:    
Advertisement

Similar News