గోడ మీద చెవిరెడ్డి రాతలు- మరోసారి అరెస్ట్

వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని ప్రభుత్వం వెంటాడుతోంది. సమైక్యాంధ్ర ఉద్యమంలో ఆందోళనకు సంబంధించిన కేసులో ఇప్పటికే చెవిరెడ్డిని అరెస్ట్ చేసి నెల్లూరు జైలుకు తరలించిన పోలీసులు మరో కేసు నమోదు చేశారు. ఈసారి కేసు నమోదుకు పోలీసులు చెప్పిన కారణం కాసింత కామెడీగానే అనిపిస్తుంది. 2009లో ”జగన్ నాయకత్వం వర్ధిల్లాలి” అని గోడలపై రాతలు రాయించినందుకు చెవిరెడ్డిపై కేసు నమోదు చేశామని పోలీసులు చెబుతున్నారు. నెల్లూరు జైలులో ఉన్న చెవిరెడ్డిని గోడల మీద రాతల కేసులో చిత్తూరు జిల్లా […]

Advertisement
Update:2016-01-21 11:56 IST

వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని ప్రభుత్వం వెంటాడుతోంది. సమైక్యాంధ్ర ఉద్యమంలో ఆందోళనకు సంబంధించిన కేసులో ఇప్పటికే చెవిరెడ్డిని అరెస్ట్ చేసి నెల్లూరు జైలుకు తరలించిన పోలీసులు మరో కేసు నమోదు చేశారు. ఈసారి కేసు నమోదుకు పోలీసులు చెప్పిన కారణం కాసింత కామెడీగానే అనిపిస్తుంది. 2009లో ”జగన్ నాయకత్వం వర్ధిల్లాలి” అని గోడలపై రాతలు రాయించినందుకు చెవిరెడ్డిపై కేసు నమోదు చేశామని పోలీసులు చెబుతున్నారు. నెల్లూరు జైలులో ఉన్న చెవిరెడ్డిని గోడల మీద రాతల కేసులో చిత్తూరు జిల్లా పీలేరు కోర్టుకు తరలించారు. వైసీపీ ప్రజాప్రతినిధులపై కావాలనే ప్రభుత్వం కేసులు మోపుతోందనడానికి ”గోడల మీద రాతల”పై కేసు నమోదు చేయడమేనని వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరు జైలులో ఉన్న ఎంపీ మిథున్ రెడ్డి, చెవిరెడ్డిలను జగన్ పరామర్శించిన రోజే ప్రభుత్వం మరో కేసులో చెవిరెడ్డిని అరెస్ట్ చేయడం ఆసక్తిగా ఉంది.

Tags:    
Advertisement

Similar News