చరణ్‌పై యండమూరి వివాదాస్పద వ్యాఖ్యలు

ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ ఓ ఇంజనీరింగ్‌ కాలేజ్ ఫంక్షన్‌లో ప్రసంగిస్తూ మధ్యలో హీరో చరణ్‌ను ఉదాహరణగా వాడారు. సంగీత దర్శకుడు దేవీశ్రీప్రసాద్‌తో పోలిక పెట్టి చరణ్‌ను తక్కువ చేశారు. చిరుతో కలిసి అభిలాష సినిమాకు పనిచేసిన రోజులను గుర్తు చేసుకుంటూ యండమూరి ఏమన్నారంటే ”అప్పట్లో చరణ్ను హీరోను చేయడానికి తల్లి సురేఖ ఎంతో కష్టపడేది. డ్యాన్స్లు నేర్పించేది. ఆ సమయంలో ఆ అబ్బాయి దవడ సరిగా ఉండేది కాదు, తరువాత దాన్ని బాగు చేయించారు. అదే […]

Advertisement
Update:2016-01-20 09:27 IST

ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ ఓ ఇంజనీరింగ్‌ కాలేజ్ ఫంక్షన్‌లో ప్రసంగిస్తూ మధ్యలో హీరో చరణ్‌ను ఉదాహరణగా వాడారు. సంగీత దర్శకుడు దేవీశ్రీప్రసాద్‌తో పోలిక పెట్టి చరణ్‌ను తక్కువ చేశారు. చిరుతో కలిసి అభిలాష సినిమాకు పనిచేసిన రోజులను గుర్తు చేసుకుంటూ యండమూరి ఏమన్నారంటే ”అప్పట్లో చరణ్ను హీరోను చేయడానికి తల్లి సురేఖ ఎంతో కష్టపడేది. డ్యాన్స్లు నేర్పించేది. ఆ సమయంలో ఆ అబ్బాయి దవడ సరిగా ఉండేది కాదు, తరువాత దాన్ని బాగు చేయించారు. అదే సమయంలో మరో ఎనిమిదేళ్ల కుర్రాడు మాత్రం ఎంతో ప్రతిభ కనబరిచేవాడు. ఇళయరాజా స్వర పరిచిన అబ్బనీ తియ్యనీ దెబ్బ పాట విని, ఇది శివరంజనీ రాగం అని టక్కున చెప్పాడు. దీంతో ఇళయరాజా ఆ అబ్బాయిని మెచ్చుకున్నాడు. అతనే దేవిశ్రీ ప్రసాద్” అన్నారు. అంతటితో ఆగలేదు విద్యార్థుల నుంచి స్పందననూ పోల్చారు యండమూరి.

తాను చరణ్‌ పేరు చెప్పినప్పుడు విద్యార్థులెవరూ చప్పట్లు కొట్టలేదు. అదే దేవీ శ్రీప్రసాద్ గురించి చెప్పగానే చప్పట్లు కొట్టారు… ఎందుకు అని ప్రశ్నించారు. జవాబు కూడా ఆయనే చెప్పారు. దేవీ శ్రీప్రసాద్ స్వశక్తితో పైకి వచ్చారు కాబట్టి చప్పట్టు కొట్టారని అన్నారు. సమాజంతో నువ్వు ఏంటి అన్నదే ముఖ్యమని మీ నాన్న ఎవరు అన్నది ముఖ్యం కాదన్నారు. అయితే యండమూరి విద్యార్థులకు స్పూర్తి కథలు చెప్పేందుకు చరణ్‌ను నెగిటివ్ టచ్‌లో వాడుకోవడం చర్చనీయాంశమైంది. దీనిపై మెగాఫ్యాన్స్ ఎలా స్పందిస్తారో చూడాలి.

Tags:    
Advertisement

Similar News