హెచ్‌సీయూలో సొంత నేతలకు ఆంక్షలు పెట్టిన రాహుల్
హెచ్‌సీయూ విద్యార్థి రోహిత్ ఆత్మహత్య అంశం దేశాన్ని కుదిపేస్తోంది. ఈ నేపథ్యంలో మంగళవారం వర్శటీకి వచ్చిన రాహుల్ విద్యార్థి సంఘాలతో మాట్లాడారు. వారి పోరాటానికి సంఘీభావం తెలిపారు. అయితే రాహుల్ వచ్చిన సమయంలో కాంగ్రెస్ నేతలంతా దూరదూరంగానే ఉన్నారు. ఇలా ఉండడానికి కారణం రాహుల్ పెట్టిన ఆంక్షలేనట. ఢిల్లీ నుంచి వచ్చిన రాహుల్ బేగంపేట ఎయిర్‌పోర్టులో దిగగా స్వాగతం పలికేందుకు కాంగ్రెస్ నేతలు పెద్ద సంఖ్యలోనే వెళ్లారు. అయితే వారిని చూసి రాహుల్ కొన్ని ఆంక్షలు పెట్టారట. […]
హెచ్‌సీయూ విద్యార్థి రోహిత్ ఆత్మహత్య అంశం దేశాన్ని కుదిపేస్తోంది. ఈ నేపథ్యంలో మంగళవారం వర్శటీకి వచ్చిన రాహుల్ విద్యార్థి సంఘాలతో మాట్లాడారు. వారి పోరాటానికి సంఘీభావం తెలిపారు. అయితే రాహుల్ వచ్చిన సమయంలో కాంగ్రెస్ నేతలంతా దూరదూరంగానే ఉన్నారు. ఇలా ఉండడానికి కారణం రాహుల్ పెట్టిన ఆంక్షలేనట. ఢిల్లీ నుంచి వచ్చిన రాహుల్ బేగంపేట ఎయిర్‌పోర్టులో దిగగా స్వాగతం పలికేందుకు కాంగ్రెస్ నేతలు పెద్ద సంఖ్యలోనే వెళ్లారు. అయితే వారిని చూసి రాహుల్ కొన్ని ఆంక్షలు పెట్టారట.
యూనివర్శిటీకి ఎవరూ తన వెంట రావద్దని ఆదేశించారు. సీనియర్ నేతలు వచ్చినా హడావుడి చేయవద్దని… పార్టీ కండువాలు వేసుకుని అస్సలు రావద్దని సూచించారట. కార్యకర్తల నినాదాలు, హంగామా ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండకూడదని ఆదేశించారు. అందువల్లే రాహుల్ పర్యటన సందర్భంగా ఎక్కడా కూడా కాంగ్రెస్ జెండాగానీ, కండువాలు కానీ కనిపించలేదు. జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్ రెడ్డి లాంటి సీనియర్లు కూడా పార్టీ కండువా లేకుండానే వచ్చారు. వేదిక మీద వారు ఒకపక్క సైలెంట్‌గా నిలబడ్డారు. రోహిత్ మరణాన్ని కాంగ్రెస్ రాజకీయం చేస్తోందన్న భావన రాకుండా ఉండేందుకే రాహుల్ ఇలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారని చెబుతున్నారు.