నమ్మిన వాడి కోసం అంత పని చేసిన లోకేష్
ఓటుకు నోటు కేసులో తెలంగాణ ఏసీబీ విచారణకు హాజరైన ప్రదీప్ చౌదరి గ్రేటర్ ఎన్నికల బరిలో దిగుతున్నారు. లోకేష్ ఆశీర్వాదంతో ప్రదీప్ చౌదరి ఆఖరి నిమిషంలో టికెట్ సొంతం చేసుకున్నారు. వెంగళరావునగర్ నుంచి నామినేషన్ దాఖలు చేశాడు ప్రదీప్ చౌదరి. అయితే ప్రదీప్ చౌదరికి టికెట్ నాటకీయపరిణామాల మధ్య దక్కింది. వెంగళరావునగర్ స్థానం తమకు కేటాయించాలని బీజేపీ పట్టుపట్టింది. అంతేకాదు టీడీపీ నుంచి కూడా మరొక నేత పోటీకి సిద్ధపడ్డారు. అయితే నేరుగా రంగంలోకి దిగిన లోకేష్ […]
Advertisement
ఓటుకు నోటు కేసులో తెలంగాణ ఏసీబీ విచారణకు హాజరైన ప్రదీప్ చౌదరి గ్రేటర్ ఎన్నికల బరిలో దిగుతున్నారు. లోకేష్ ఆశీర్వాదంతో ప్రదీప్ చౌదరి ఆఖరి నిమిషంలో టికెట్ సొంతం చేసుకున్నారు. వెంగళరావునగర్ నుంచి నామినేషన్ దాఖలు చేశాడు ప్రదీప్ చౌదరి. అయితే ప్రదీప్ చౌదరికి టికెట్ నాటకీయపరిణామాల మధ్య దక్కింది. వెంగళరావునగర్ స్థానం తమకు కేటాయించాలని బీజేపీ పట్టుపట్టింది. అంతేకాదు టీడీపీ నుంచి కూడా మరొక నేత పోటీకి సిద్ధపడ్డారు. అయితే నేరుగా రంగంలోకి దిగిన లోకేష్ బీజేపీ నేతల ప్రతిపాదనకు ఒప్పుకోలేదు. వెంగళరావునగర్ సీటు తమకు కేటాయించాల్సిందేనని పట్టుపట్టారు. దీంతో బీజేపీ నేతలు వెనక్కుతగ్గారు. వెంగళరావునగర్ నుంచి పోటీకి మరో టీడీపీ నేత సిద్ధమవగా లోకేష్ జోక్యంతో అతడు కూడా సైలెంట్ అయిపోయారు. ఇలా లైన్ క్లియర్ అయిన తర్వాత ప్రదీప్ చౌదరి పేరును లోకేష్ ప్రతిపాదించారు. పలువురు సన్నిహితులకు టికెట్లు ఇప్పించిన లోకేష్ వారిలో ప్రదీప్ చౌదరికి తొలి ప్రాధాన్యత ఇచ్చారని చెబుతున్నారు. తెలంగాణలో ఎమ్మెల్యే కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టిఫెన్‌సన్‌కు రేవంత్ రెడ్డి భారీగా డబ్బు ముట్టజెప్పారు. ఇదంతా స్టింగ్ ఆపరేషన్‌లో బయటపడింది. ఈ వ్యవహారంలో నిందితుల కాల్ లిస్ట్ పరిశీలించగా ప్రదీప్ చౌదరి నుంచి అనేకసార్లు కాల్స్ వచ్చినట్టు తేలింది. రేవంత్‌కు డబ్బు అందజేసింది ప్రదీపేనన్నది టీ ఏసీబీ అనుమానం. ఈ కేసులో ప్రదీప్ చౌదరి పేరు ప్రముఖంగా వినిపించింది. ఇప్పుడు ప్రదీప్ చౌదరి గ్రేటర్‌లో లోకేష్ ఆశీసులతో కార్పొరేటర్‌గా పోటీ చేస్తున్నారు.
Click to Read:
Advertisement