అరెస్ట్‌ల పర్వం- నెల్లూరు జైలుకు చెవిరెడ్డి తరలింపు

ఏపీలో వైసీపీ ప్రజాప్రతినిధుల అరెస్ట్‌ల పర్వం కొనసాగుతోంది. ఎంపీ మిథున్‌ రెడ్డి, నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని అరెస్ట్ చేశారు. సమైకాంధ్ర ఉద్యమ సమయంలో జరిగిన ఆందోళనకు సంబంధించిన కేసులో చెవిరెడ్డిని సోమవారం ఉదయం అరెస్ట్ చేశారు. అనంతరం నెల్లూరు కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు ఈనెల 29 వరకు చెవిరెడ్డికి రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు చెవిరెడ్డిని నెల్లూరు జైలుకు తరలించారు. అరెస్ట్ సందర్భంగా చంద్రబాబు ప్రభుత్వంపై చెవిరెడ్డి […]

Advertisement
Update:2016-01-18 12:39 IST

ఏపీలో వైసీపీ ప్రజాప్రతినిధుల అరెస్ట్‌ల పర్వం కొనసాగుతోంది. ఎంపీ మిథున్‌ రెడ్డి, నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని అరెస్ట్ చేశారు. సమైకాంధ్ర ఉద్యమ సమయంలో జరిగిన ఆందోళనకు సంబంధించిన కేసులో చెవిరెడ్డిని సోమవారం ఉదయం అరెస్ట్ చేశారు. అనంతరం నెల్లూరు కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు ఈనెల 29 వరకు చెవిరెడ్డికి రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు చెవిరెడ్డిని నెల్లూరు జైలుకు తరలించారు. అరెస్ట్ సందర్భంగా చంద్రబాబు ప్రభుత్వంపై చెవిరెడ్డి విరుచుకుపడ్డారు. సమైక్యాంధ్ర ఉద్యమ కేసులను ఎత్తివేస్తామని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు అదే కేసులో తనను అరెస్ట్ చేయించడం దారుణమన్నారు. కక్షపూరితంగా వైసీపీ ప్రజాప్రతినిధులను ప్రభుత్వం అరెస్ట్ చేయిస్తోందని ఆరోపించారు. చెవిరెడ్డి అరెస్ట్తో చిత్తూరు జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు ఆందోళనకు దిగారు.

Click to Read:

Tags:    
Advertisement

Similar News