గ్లకోమా ఉంటే… ఈ వ్యాయామాలు వద్దు..!
కంటివ్యాధి గ్లకోమాతో బాధపడే వారు వ్యాయామాలు, యోగా చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలని అమెరికా కంటి వైద్య నిపుణులు చెబుతున్నారు. కనుగుడ్డుమీద ఒత్తిడి పెరిగే సమస్యను గ్లకోమా అంటారు. ఈ సమస్య ఉన్నపుడు తలను కిందకు వంచాల్సిన యోగాసనాలు, బరువులు ఎత్తే వ్యాయామాలు చేస్తే పరిస్థితి మరింత దారుణంగా మారుతుందని న్యూయార్క్‌లోని కన్ను, చెవి ఆసుపత్రికి చెందిన నిపుణులు హెచ్చరిస్తున్నారు. తలను కిందకు వంచి చేసే కొన్ని రకాల యోగాసనాలను వీరు ప్రత్యేకంగా పేర్కొన్నారు. గ్లకోమా ఉన్నవారు […]
కంటివ్యాధి గ్లకోమాతో బాధపడే వారు వ్యాయామాలు, యోగా చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలని అమెరికా కంటి వైద్య నిపుణులు చెబుతున్నారు. కనుగుడ్డుమీద ఒత్తిడి పెరిగే సమస్యను గ్లకోమా అంటారు. ఈ సమస్య ఉన్నపుడు తలను కిందకు వంచాల్సిన యోగాసనాలు, బరువులు ఎత్తే వ్యాయామాలు చేస్తే పరిస్థితి మరింత దారుణంగా మారుతుందని న్యూయార్క్‌లోని కన్ను, చెవి ఆసుపత్రికి చెందిన నిపుణులు హెచ్చరిస్తున్నారు. తలను కిందకు వంచి చేసే కొన్ని రకాల యోగాసనాలను వీరు ప్రత్యేకంగా పేర్కొన్నారు. గ్లకోమా ఉన్నవారు మిగిలిన అన్ని పనులను చేసుకుంటూ చురుకైన జీవితం గడపాలని తాము చెబుతుంటామని, అయితే వీరు కొన్ని రకాల యోగాసనాలతో పాటు పుషప్స్, బరువులు ఎత్తడం లాంటి వ్యాయామాలు అసలు చేయరాదని న్యూయార్క్‌లోని గ్లకోమా రీసెర్చి సెంటర్‌కి డైరక్టర్‌గా ఉన్న రాబర్ట్ రిట్చ్ అంటున్నారు. ఇలా చేస్తే ఒత్తిడికి గురవుతున్న కంటినరం మరింతగా దెబ్బతింటుందని రాబర్ట్ అన్నారు. యోగా చేసేవారిలో ఎవరికైనా గ్లకోమా సమస్య ఉంటే తమ యోగా శిక్షకుడికి ఆ విషయాన్ని చెప్పాలని, అలాగే యోగాలో శిక్షణ ఇచ్చేవారు తమవద్దకు వచ్చేవారికి గ్లకోమా ఉంటే, తలను కిందకు వంచే వ్యాయామాలు, ఆసనాలు లేకుండా శిక్షణ ఇవ్వాలని వీరు సూచిస్తున్నారు.