బాలయ్య లోపల, బయట రాజకీయం

ఎన్టీఆర్‌ వర్ధంతి రోజు బాలయ్య తనలోని రెండు వైపులను ఒకేసారి చూపించారు. ఉదయం ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద నివాళులర్పించిన బాలయ్య అక్కడి ఏర్పాట్లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నేడు తెలంగాణలోని మంత్రులుగా ఉన్న వారికి కూడా రాజకీయ భిక్ష పెట్టింది ఎన్టీఆరేనని అలాంటి వ్యక్తి వర్థంతిలో ఏర్పాట్లు ఇలాగేనా చేసేది అని మండిపడ్డారు. ఇది దురదృష్టమని ఆవేదన చెందారు.  బాలయ్య పరోక్షంగా టీఆర్‌ఎస్‌ తీరునే తీవ్రంగా తప్పుపట్టారు. టీఆర్‌ఎస్‌పై ఈ వ్యాఖ్యలు చేసి గంట కూడా […]

Advertisement
Update:2016-01-18 11:58 IST

ఎన్టీఆర్‌ వర్ధంతి రోజు బాలయ్య తనలోని రెండు వైపులను ఒకేసారి చూపించారు. ఉదయం ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద నివాళులర్పించిన బాలయ్య అక్కడి ఏర్పాట్లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నేడు తెలంగాణలోని మంత్రులుగా ఉన్న వారికి కూడా రాజకీయ భిక్ష పెట్టింది ఎన్టీఆరేనని అలాంటి వ్యక్తి వర్థంతిలో ఏర్పాట్లు ఇలాగేనా చేసేది అని మండిపడ్డారు. ఇది దురదృష్టమని ఆవేదన చెందారు. బాలయ్య పరోక్షంగా టీఆర్‌ఎస్‌ తీరునే తీవ్రంగా తప్పుపట్టారు. టీఆర్‌ఎస్‌పై ఈ వ్యాఖ్యలు చేసి గంట కూడా గడవకముందే బాలయ్య నేరుగా కేసీఆర్ వద్ద వాలిపోయారు. డిక్టేటర్ సినిమా చూడాలంటూ ఆహ్వానించారు. బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి భవనాలను క్రమబద్దీకరించాలని కోరారు. ఇద్దరూ కుశల ప్రశ్నలు వేసుకున్నారు. వందో సినిమా సంగతులు కూడా కేసీఆర్‌ను కూర్చోబెట్టి వివరించారు బాలయ్య. అక్కడ మాత్రం ఎన్టీఆర్ వర్ధంతి ఏర్పాట్ల గురించి చర్చలేదు. గంట ముందే కేసీఆర్ ప్రభుత్వాన్ని తిట్టిన బాలయ్య ఇంతలోనే ఆయనతో భేటీ కావడాన్ని టీడీపీ నేతలు ఊహించలేకపోయారు. టీటీడీపీ నేతలది మరో బాధ. జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ కేసీఆర్‌ను బాలయ్య కలవడం వల్ల సీమాంధ్ర ఓటర్లు టీఆర్‌ఎస్‌కు మరింత దగ్గరవుతారని తలపట్టుకుంటున్నారు. అదన్న మాట బాలయ్యలోని రాజకీయ కోణం.

Click to Read:

Tags:    
Advertisement

Similar News