బాలయ్యతో రాజీకి సిద్ధపడుతున్న నాగార్జున
హీరోలు బాలకృష్ణ, నాగార్జున మధ్య విబేధాలున్నాయని చాలాకాలంగా ప్రచారం జరుగుతోంది. ఏఎన్ఆర్‌కు సంబంధించిన ఒక కార్యక్రమానికి బాలయ్యను ఆహ్వానించడంలో జరిగిన పొరపాటు నాగ్, బాలయ్య మధ్య చాలా గ్యాప్ పెంచిందని చెబుతుంటారు. తన విషయంలో అక్కినేని ఫ్యామిలీ నిర్లక్ష్యంపై బాలయ్య చాలాకాలం పాటు చాలా సీరియస్‌గా ఉన్నారు. అక్కినేని ఇంట జరిగిన ఒక ముఖ్యమైన కార్యక్రమానికి టాలీవుడ్ మొత్తం వెళ్లినా బాలయ్య మాత్రం వెళ్లలేదని చెబుతుంటారు. అయితే ఇప్పుడు ఈ గ్యాప్‌ను తగ్గించేందుకు నాగ్ వైపు తొలి అడుగుపడింది. సోగ్గాడే […]
హీరోలు బాలకృష్ణ, నాగార్జున మధ్య విబేధాలున్నాయని చాలాకాలంగా ప్రచారం జరుగుతోంది. ఏఎన్ఆర్‌కు సంబంధించిన ఒక కార్యక్రమానికి బాలయ్యను ఆహ్వానించడంలో జరిగిన పొరపాటు నాగ్, బాలయ్య మధ్య చాలా గ్యాప్ పెంచిందని చెబుతుంటారు. తన విషయంలో అక్కినేని ఫ్యామిలీ నిర్లక్ష్యంపై బాలయ్య చాలాకాలం పాటు చాలా సీరియస్‌గా ఉన్నారు. అక్కినేని ఇంట జరిగిన ఒక ముఖ్యమైన కార్యక్రమానికి టాలీవుడ్ మొత్తం వెళ్లినా బాలయ్య మాత్రం వెళ్లలేదని చెబుతుంటారు. అయితే ఇప్పుడు ఈ గ్యాప్‌ను తగ్గించేందుకు నాగ్ వైపు తొలి అడుగుపడింది.
సోగ్గాడే చిన్నినాయన సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో బాలయ్యతో కలిసి పనిచేసేందుకు తాను సిద్ధమేనని నాగ్ చెప్పారు. బాలకృష్ణతో కలిసి మల్టీస్టారర్ చిత్రం చేయబోతున్నట్టు చెప్పారు. మంచి కథ, అందుకు తగ్గట్టు దర్శక నిర్మాతలు దొరికితే ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రం నిర్మిస్తామని వెల్లడించారు. అన్నీ కుదిరితే బాలయ్యతో చేయడానికి తాను ఎప్పుడూ సిద్ధమేనని చెప్పారు. వ్యాపార కోణంలో చాలా ముందుండే నాగార్జున… గొడవలకు అంతగా ఇష్టపడరని చెబుతుంటారు. అందుకే బాలకృష్ణతో ఉన్న గ్యాప్‌ను తగ్గించుకునే ప్రయత్నంలో భాగంగానే నాగ్ తన మనసులో మాట బయటపెట్టారని భావిస్తున్నారు. అయితే నాగార్జునతో కలిసి పనిచేసేందుకు బాలయ్య ఎంతవరకు సుముఖత చూపుతారన్నది చూడాలి.
Click to Read: