కోడి పందాలు- పల్నాటి, బొబ్బిలి యుద్ధాలకు ఎలా కారణం?
కోడి పందాలు అనగానే గుర్తుకొచ్చేంది పల్నాటి యుద్ధం. కోడి పందాల కారణంగానే పల్నాడు యుద్ధంలో నెత్తురుపారింది. ఒకప్పుడు పల్నాడు ప్రాంతంలోని మాచర్ల ప్రాంతాన్ని మలిదేవరాజు పాటించేవారు. గురజాల ప్రాంతాన్ని నలగామరాజు ఏలేవారు. మలిదేవరాజు వద్ద బ్రహ్మనాయుడు, నలగామరాజు వద్ద నాగమ్మ మంత్రులుగా పని చేసేవారు. ఒకసారి బ్రహ్మనాయుడు, నాగమ్మలు తమ కోళ్లతో పందాలు ఆడారు. తొలుత బ్రహ్మనాయుడు పుంజు చిట్టిమల్లు గెలవగా… బరి ముగిసే సరికి నాగమ్మ పుంజు శివంగి గెలిచింది. దీన్ని మాచర్ల రాజులు అవమానంగా […]
కోడి పందాలు అనగానే గుర్తుకొచ్చేంది పల్నాటి యుద్ధం. కోడి పందాల కారణంగానే పల్నాడు యుద్ధంలో నెత్తురుపారింది. ఒకప్పుడు పల్నాడు ప్రాంతంలోని మాచర్ల ప్రాంతాన్ని మలిదేవరాజు పాటించేవారు. గురజాల ప్రాంతాన్ని నలగామరాజు ఏలేవారు. మలిదేవరాజు వద్ద బ్రహ్మనాయుడు, నలగామరాజు వద్ద నాగమ్మ మంత్రులుగా పని చేసేవారు. ఒకసారి బ్రహ్మనాయుడు, నాగమ్మలు తమ కోళ్లతో పందాలు ఆడారు. తొలుత బ్రహ్మనాయుడు పుంజు చిట్టిమల్లు గెలవగా… బరి ముగిసే సరికి నాగమ్మ పుంజు శివంగి గెలిచింది. దీన్ని మాచర్ల రాజులు అవమానంగా భావించడంతో చిలికిచిలికి గాలివానగా మారి పల్నాటి యుద్ధానికి దారి తీసింది.
బొబ్బిలి యుద్ధం కూడా ఇలాగే కొడిపందాల వల్లే జరిగింది. ఒకప్పుడు బొబ్బిలి, విజయనగర పుంజులు పోటీ పడ్డాయి. బరిలో తొలుత బొబ్బిలి పుంజులు గెలవడంతో విజయనగరరాజులు ఆగ్రహించారు. ఇక్కడ కూడా ఆఖరి బరిలో బొబ్బిలి రాజుల పుంజే గెలిచింది. దీన్ని చూసి బొబ్బిలి రాజులు గట్టిగా నవ్వడంతో అవమానంగా భావించిన విజయనగర రాజుల కోపం కట్టలు తెంచుకుందని చెబుతుంటారు. ఇది చివరకు యుద్ధానికి దారి తీసింది.