చంద్రబాబు భవిష్యత్తుపై ప్రముఖ పత్రిక ఆసక్తికర కథనం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే పనిలో నిమగ్నమైన వేళ ఆయనపై కేంద్రం కన్నేసిందని ఒక ప్రముఖ దినపత్రిక కథనాన్ని ప్రచురించింది. అయితే చంద్రబాబు దెబ్బతీయడం కోసం కాదు. చంద్రబాబు సేవలను దేశస్థాయిలో వాడుకోవాలని కేంద్రం భావిస్తోందట. ప్రముఖ తెలుగు దిన పత్రిక ఆంధ్రప్రభ మొదటి పేజ్‌లో దీనిపై కథనాన్ని ప్రచురించింది. సదరు పత్రిక చెబుతున్న దాని ప్రకారం కేంద్రం చంద్రబాబును ఉప రాష్ట్ర్రపతిని చేయాలనుకుంటోందట. ఈ ఏడాది ఆగస్టులో […]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే పనిలో నిమగ్నమైన వేళ ఆయనపై కేంద్రం కన్నేసిందని ఒక ప్రముఖ దినపత్రిక కథనాన్ని ప్రచురించింది. అయితే చంద్రబాబు దెబ్బతీయడం కోసం కాదు.
చంద్రబాబు సేవలను దేశస్థాయిలో వాడుకోవాలని కేంద్రం భావిస్తోందట. ప్రముఖ తెలుగు దిన పత్రిక ఆంధ్రప్రభ మొదటి పేజ్‌లో దీనిపై కథనాన్ని ప్రచురించింది. సదరు పత్రిక చెబుతున్న దాని ప్రకారం కేంద్రం చంద్రబాబును ఉప రాష్ట్ర్రపతిని చేయాలనుకుంటోందట. ఈ ఏడాది ఆగస్టులో ప్రస్తుత ఉపరాష్ట్ర్రపతి హమీద్ అన్సారీ పదవీకాలం ముగుస్తోంది. ఆ స్థానంలో చంద్రబాబును నియమించాలని కేంద్రం యోచన చేస్తోందట. ఇలా చేయడం వల్ల దక్షణాది ప్రాంతానికి దేశ స్థాయిలో కీలక పదవి ఇచ్చినట్టు అవుతుందని బీజేపీ నాయకత్వం భావిస్తోందని పత్రిక కథనం.
కాంగ్రెస్ హయాంలో దేశస్థాయిలో కీలకమైన పదవులన్నీ ఉత్తరాదికే దక్కాయని చంద్రబాబును ఉప రాష్ట్ర్రపతిని చేస్తే దక్షణాదిలో బీజేపీకి మరింత మంచి జరుగుతుందని కేంద్రం భావిస్తోందట. చంద్రబాబులాంటి సీనియర్ ఢిల్లీలో ఉంటే రాజకీయంగా మంచి జరుగుతుందని బీజేపీ నాయకత్వం భావిస్తోందట. పైగా ఉప రాష్ట్రపతిగా ఉన్న వ్యక్తి రాజ్యసభలో చైర్మన్ హోదాలో సభను నడుపుతారు. కాబట్టి చంద్రబాబు ఉప రాష్ట్రపతిగా ఉంటే కీలకమైన బిల్లులు రాజ్యసభలో గట్టెక్కించడం సులువన్న భావన కూడా కేంద్రంలో ఉండిఉండవచ్చు. అయితే చంద్రబాబు ఉప రాష్ట్రపతిగా వెళ్లేందుకు అంగీకరిస్తారా?… రాష్ట్ర్రం క్లిష్టపరిస్థితుల్లో ఉన్న ప్రస్తుత తరుణంలో ఆయన స్టేట్ వదిలి వెళ్తారా? అన్నది కూడా కీలకమైన పాయింటే!. పైగా లోకేష్‌ను రాజ్యసభకు పంపుతారని ఓ వైపు ప్రచారం జరుగుతోంది. చూడాలి ఆంధ్రప్రభ కథనం ఎంతవరకు నిజమవుతుందో!.