బొజ్జలకు ప్రాణహాని ఎవరి నుంచి?

ఏపీ అటవీ శాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డికి ప్రభుత్వం భద్రతను మరింత పెంచింది. ఆయనకు కొత్తగా బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కేటాయించారు. బుల్లెట్ ప్రూఫ్‌ వాహనంతో పాటు మరో భద్రతా సిబ్బందిని పెంచారు.  ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎర్రచందనం స్మగ్లర్ల నుంచి మంత్రికి ప్రాణహాని ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించిన నేపథ్యంలోనే భద్రత పెంచినట్టు ప్రభుత్వం చెబుతోంది. శేషాచలం అడవుల్లో ఒకే రోజు 22 మంది కూలీలను ఎన్‌కౌంటర్ చేయడం వంటి ఘటనల […]

Advertisement
Update:2016-01-13 17:40 IST

ఏపీ అటవీ శాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డికి ప్రభుత్వం భద్రతను మరింత పెంచింది. ఆయనకు కొత్తగా బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కేటాయించారు. బుల్లెట్ ప్రూఫ్‌ వాహనంతో పాటు మరో భద్రతా సిబ్బందిని పెంచారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎర్రచందనం స్మగ్లర్ల నుంచి మంత్రికి ప్రాణహాని ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించిన నేపథ్యంలోనే భద్రత పెంచినట్టు ప్రభుత్వం చెబుతోంది. శేషాచలం అడవుల్లో ఒకే రోజు 22 మంది కూలీలను ఎన్‌కౌంటర్ చేయడం వంటి ఘటనల వల్ల మంత్రికి ముప్పు ఉందని భావిస్తున్నారు. ఏమైనా ముందస్తు చర్యలు తీసుకోవడం తప్పులేదు.

మరో వైపు బొజ్జలకు తమిళనాడుకు చెందిన ఎర్రచందనం స్మగ్లర్లు ఫోన్ చేసి బెదిరించినట్లు సమాచారం. దీనిపై పోలీసులకు మంత్రి ఫిర్యాదు చేసినట్టు చెబుతున్నారు. దీనిపై స్పందించిన మంత్రి తాను వృద్ధుడినని తననేమీ చేస్తారని అన్నారు.

 

Tags:    
Advertisement

Similar News