చిరుకు ప్రమోషన్!- ఎందుకంటే?

రాజ్యసభ ఎంపీ చిరంజీవికి కాంగ్రెస్‌ పార్టీలో త్వరలో ప్రమోషన్ రాబోతోంది. చిరును కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)లోకి తీసుకోవాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించినట్టు సమాచారం. ఏఐసీసీ, సీడబ్ల్యూసీలను పునరుద్దరించాలని సోనియా నిర్ణయించారు. కొద్ది రోజుల్లోనే ఈ ప్రక్రియ ప్రారంభం కానుందని ఏఐసీసీ వర్గాలు చెబుతున్నాయి. చిరును సీడబ్ల్యూసీలోకి తీసుకోవడం ద్వారా ఏపీలో కాపులకు దగ్గర కావచ్చని కాంగ్రెస్ భావిస్తోంది. ప్రస్తుతం ఏపీ కాంగ్రెస్‌లో చిరును మించి జనాకర్షణ ఉన్న ఫిగర్ లేదన్నది అధిష్టానం భావన. భవిష్యత్తులో చిరుకే పార్టీ బాధ్యతలు అప్పగించే […]

Advertisement
Update:2016-01-13 05:53 IST

రాజ్యసభ ఎంపీ చిరంజీవికి కాంగ్రెస్‌ పార్టీలో త్వరలో ప్రమోషన్ రాబోతోంది. చిరును కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)లోకి తీసుకోవాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించినట్టు సమాచారం. ఏఐసీసీ, సీడబ్ల్యూసీలను పునరుద్దరించాలని సోనియా నిర్ణయించారు. కొద్ది రోజుల్లోనే ఈ ప్రక్రియ ప్రారంభం కానుందని ఏఐసీసీ వర్గాలు చెబుతున్నాయి. చిరును సీడబ్ల్యూసీలోకి తీసుకోవడం ద్వారా ఏపీలో కాపులకు దగ్గర కావచ్చని కాంగ్రెస్ భావిస్తోంది. ప్రస్తుతం ఏపీ కాంగ్రెస్‌లో చిరును మించి జనాకర్షణ ఉన్న ఫిగర్ లేదన్నది అధిష్టానం భావన. భవిష్యత్తులో చిరుకే పార్టీ బాధ్యతలు అప్పగించే అవకాశం కూడా ఉందని చెబుతున్నారు. సీడబ్ల్యూసీ సభ్యత్వానికి ఏపీ నుంచి రాజ్యసభ సభ్యుడు కేవీపీ పేరును కూడా అధిష్ఠానం పరిశీలిస్తోంది. అయితే చిరు విషయంలో రాహుల్ ఆసక్తిగా ఉన్నారని చెబుతున్నారు. చట్టసభల్లో ఏపీ నుంచి కాంగ్రెస్‌కు ప్రాతినిత్యమే లేకుండా పోయిన నేపథ్యంలో రాష్ట్రానికి పార్టీ పదవుల్లో పెద్దపీట వేయాలని కాంగ్రెస్ నాయకత్వం అనుకుంటోంది.

Tags:    
Advertisement

Similar News