పోలవరంపై రాష్ట్రానికి కేంద్రం షాక్
ప్రతిష్టాత్మక పోలవరం విషయంలో రాష్ట్ర ప్రభుత్వ తీరుపై కేంద్రం ఆగ్రహంగా ఉంది. ఏకంగా పోలవరం నిధులను తాత్కాలికంగా నిలిపివేసే స్థాయికి పరిస్థితి వెళ్లింది. కేంద్రం ఇంత కఠిన నిర్ణయం తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వ వైఖరే కారణమని తెలుస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం జాతీయ హోదా ఇచ్చింది. అంటే ప్రాజెక్టు నిర్మాణ బాధ్యత కేంద్రానిదే. కానీ ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమాంతం 16 వేల కోట్ల నుంచి ఏకంగా 36 వేల […]
ప్రతిష్టాత్మక పోలవరం విషయంలో రాష్ట్ర ప్రభుత్వ తీరుపై కేంద్రం ఆగ్రహంగా ఉంది. ఏకంగా పోలవరం నిధులను తాత్కాలికంగా నిలిపివేసే స్థాయికి పరిస్థితి వెళ్లింది. కేంద్రం ఇంత కఠిన నిర్ణయం తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వ వైఖరే కారణమని తెలుస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం జాతీయ హోదా ఇచ్చింది. అంటే ప్రాజెక్టు నిర్మాణ బాధ్యత కేంద్రానిదే. కానీ ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమాంతం 16 వేల కోట్ల నుంచి ఏకంగా 36 వేల కోట్లకు ఇటీవల పెంచింది. జలవనరుల శాఖతో పాటు ఆర్థిక శాఖా కూడా ఈ ప్రతిపాదనలను సమర్ధించడంతో ముఖ్యమంత్రి ఆమోదముద్ర వేశారని… ఆ తరువాత జలవనరులు, ఆర్థిక శాఖలు నాలిక్కరుచుకుని అంచనాల సవరణ సరికాదన్న భావాన్ని వ్యక్తం చేసినట్లు తెలిసింది.
ఈ విషయాన్ని కేంద్రానికి చెప్పకుండానే రాష్ట్ర ప్రభుత్వం చేసింది. ఇలా ఏకంగా 16 వేల కోట్ల నుంచి 36 వేల కోట్లకు ప్రాజెక్టు వ్యయం పెంచడంపై అప్పట్లో పెద్దఎత్తున విమర్శలు , ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై కేంద్రం కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. జాతీయ హోదా ప్రాజెక్టుకు రాష్ట్రంలో అంచనా వ్యయం పెంచడం ఎంతవరకు సమంజసమని కేంద్ర అధికారులు ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి రాష్ట్రానికి ఆ అధికారం కూడా లేదని అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. పథకాన్ని ఎంత నిధులతో, ఎలా పూర్తి చేయాలన్నది తమ పరిధిలోని అంశమని కేంద్రం చెబుతోంది. నిధుల విడుదలను కేంద్రం తాత్కాలికంగా నిలిపివేసిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.