రెజీనాకు కోటిన్నర రెమ్యూనరేషన్ !
స్టార్ హీరో సినిమాలో నటించే అవకాశం వస్తే… రెమ్యూనరేషన్ విషయంలో కాస్త చూసిచూడనట్టు వ్యవహరించే అందాల భామలు… కొత్త హీరోల సరసన రొమాన్స్ చేయాల్సి వస్తే మాత్రం నిర్మాతల నుంచి సాధ్యమైనంత ఎక్కువగా డబ్బులు వసూలు చేయడానికి ప్రయత్నిస్తుంటారు… కొత్త హీరోతో సినిమా చేస్తే… కెరీర్‌కు ఎక్కువగా ఉపయోగం ఉండే అవకాశం ఉండదు కాబట్టి… రిస్క్‌కు తగిన రివార్డ్ తీసుకోవాలన్నది చాలామంది అందాల భామల ఆలోచన… బెల్లంకొండ సురేశ్ తనయుడు బెల్లంకొండ శ్రీనివాస్ ఫస్ట్ మూవీ అల్లుడు […]
Advertisement
స్టార్ హీరో సినిమాలో నటించే అవకాశం వస్తే… రెమ్యూనరేషన్ విషయంలో కాస్త చూసిచూడనట్టు వ్యవహరించే అందాల భామలు… కొత్త హీరోల సరసన రొమాన్స్ చేయాల్సి వస్తే మాత్రం నిర్మాతల నుంచి సాధ్యమైనంత ఎక్కువగా డబ్బులు వసూలు చేయడానికి ప్రయత్నిస్తుంటారు… కొత్త హీరోతో సినిమా చేస్తే… కెరీర్‌కు ఎక్కువగా ఉపయోగం ఉండే అవకాశం ఉండదు కాబట్టి… రిస్క్‌కు తగిన రివార్డ్ తీసుకోవాలన్నది చాలామంది అందాల భామల ఆలోచన… బెల్లంకొండ సురేశ్ తనయుడు బెల్లంకొండ శ్రీనివాస్ ఫస్ట్ మూవీ అల్లుడు శీనులో నటించే సమయంలో ఇదే స్ట్రాటజీని ఫాలో అయిన సమంత ఏకంగా కోటి దాకా తన ఖాతాలో వేసుకుందని ఇండస్ట్రీ వర్గాలు అంటుంటాయి… లేటెస్ట్‌గా సమంత స్ట్రాటజీనే అప్ కమింగ్ బ్యూటీ రెజీనా కూడా అమలు చేయబోతోందని సినీ జనం గుసగుసలాడుకుంటున్నారు…
గల్ఫ్ దేశాల్లో తెలుగు సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేసే ఆశ్వినీ కుమార్ సహదేవ్ అనే పంపిణీదారుడు… తన కుమారుడు ఆకాష్‌ను టాలీవుడ్‌కు హీరోగా పరిచయం చేయాలని డిసైడయ్యాడు. ఇందుకోసం కథ, దర్శకుడు వంటి వాటిని ఫైనలైజ్ చేసుకున్న తరువాత హీరోయిన్‌గా రెజీనాను ఎంపిక చేయాలని ఆమెను కలిశారట. కొత్త హీరో సరసన నటించే అవకాశం కావడంతో… ఈ సినిమా కోసం రెజీనా ఏకంగా కోటిన్నర డిమాండ్ చేసిందని టాక్. దీంతో అశ్వినీ కుమార్‌కు ఏం చేయాలో అర్థం కావడం లేదట. అయితే… పైకి కోటిన్నర డిమాండ్ చేసినట్టు కనిపించినా… కోటికి బేరమాడి సినిమాను ఫిక్స్ చేసుకోవాలనే ఆలోచనతో ఉందట రెజీనా… శరభ అనే టైటిల్‌తో తెరకెక్కబోయే ఈ సినిమా ఏప్రిల్ నుంచి సెట్స్ మీదకు వెళుతుందని… ఇందులో హీరోయిన్‌గా రెజీనా దాదాపుగా ఫిక్స్ అయ్యిందనే వార్తలు వినిపిస్తున్నాయి. దీపం ఉండగానే ఇల్లు చక్క బెట్టుకునే వ్యవహారం అంటే ఇదే మరి.
Advertisement