రాయపాటి మళ్లీ అదే "పాట"- మిగిలిన నేతలూ ఇలాగే తయారైతే?

రాయపాటి సాంబశివరావు. సీనియర్ టీడీపీ ఎంపీ. వయసులోనూ పెద్దవారే. కానీ ఎంతో జాగ్రత్తగా మాట్లాడాల్సింది పోయి ప్రాంతీయ విభేదాలకు ఆజ్యం పోసేలా… విభజనతో కుచించుకుపోయిన ఏపీలోనూ మళ్లీ ”మా జిల్లా… మీజిల్లా” అంటూ కురుచ ఆలోచనతో మాట్లాడడం ఆందోళనకరం. రెండు రోజుల క్రితం రైల్వే జీఎంతో జరిగిన సమావేశంలో రాయపాటి అనకూడని మాటలే అన్నారు. అప్పుడేదో నోరు జారీ మాట్లాడి ఉంటారనుకున్నారు చాలామంది. కానీ ఆదివారం కూడా మరోసారి ఆయన తన వ్యాఖ్యలను సమర్ధించుకోవడం బట్టి చూస్తుంటే నేతల […]

Advertisement
Update:2016-01-10 10:23 IST

రాయపాటి సాంబశివరావు. సీనియర్ టీడీపీ ఎంపీ. వయసులోనూ పెద్దవారే. కానీ ఎంతో జాగ్రత్తగా మాట్లాడాల్సింది పోయి ప్రాంతీయ విభేదాలకు ఆజ్యం పోసేలా… విభజనతో కుచించుకుపోయిన ఏపీలోనూ మళ్లీ ”మా జిల్లా… మీజిల్లా” అంటూ కురుచ ఆలోచనతో మాట్లాడడం ఆందోళనకరం. రెండు రోజుల క్రితం రైల్వే జీఎంతో జరిగిన సమావేశంలో రాయపాటి అనకూడని మాటలే అన్నారు. అప్పుడేదో నోరు జారీ మాట్లాడి ఉంటారనుకున్నారు చాలామంది. కానీ ఆదివారం కూడా మరోసారి ఆయన తన వ్యాఖ్యలను సమర్ధించుకోవడం బట్టి చూస్తుంటే నేతల మనస్తత్వం ఇంత బలహీనపడిందా అనిపించకమానదు.

జీఎంతో జరిగిన సమావేశంలో ”తుపాన్లు ముంచెత్తే విశాఖకు ప్రత్యేక రైల్వే జోన్ అవసరమా” అని ప్రశ్నించి కలకలం రేపారు రాయపాటి. రైల్వే జోన్ గుంటూరు, కృష్ణా పరిధిలో నిర్మిస్తున్న రాజధాని వద్ద ఉంటే బాగుంటుందని వ్యాఖ్యానించారు. కానీ విశాఖ రైల్వే జోన్‌ నినాదం పార్టీలు మారిన నేతల అవసరాన్ని బట్టి వచ్చినది కాదు. ఉత్తరాంధ్ర ప్రజలు దశాబ్దాలుగా సాగిస్తున్న పోరాట నినాదం అది. అలాంటి రైల్వే జోన్ విషయంలో ఒక గల్లీ లీడర్ ఇచ్చినట్టు సీనియర్ ఎంపీ స్టేట్‌మెంట్ ఇవ్వడం తప్పు కాదా?. తుపానులే రైల్వే జోన్‌కు అడ్డంకి అనుకుంటే రాజధాని నిర్మిస్తున్న ప్రాంతంతో పాటు తీరాన ఉన్న జిల్లాలకు మొత్తం ఆ ముప్పు పొంచి ఉంది. పైగా … ఆదివారం తన వ్యాఖ్యలపై స్పందించిన రాయపాటి తాను అన్నదాన్ని తప్పుపట్టడం సరికాదన్నారు. ఉత్తరాంధ్ర, విశాఖ వాళ్లే ప్రజాప్రతినిధులు కాదని… తాము కూడా నాయకులమే కాబట్టి తమ ప్రాంత అవసరాలపై మాట్లాడుతామని సెలవిచ్చారు. అయితే రాయపాటి చెప్పిన నీతి సూత్రం ఆధారంగానే రాజధాని కూడా తమ ప్రాంతంలోనే ఉండాలని పోరాటంచేసే హక్కు అటు రాయలసీమ, ఇటు ఉత్తరాంధ్ర, మిగిలిన జిల్లాల వారికి కూడా ఉంటుంది కదా!. ఆ ప్రాతిపదికనే రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల నేతలు రాజధాని డిమాండ్‌తో ఉద్యమిస్తే దాన్ని కూడా నరసరావుపేట ఎంపీ స్వాగతిస్తారా?.

కృష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలో కీలకమైన రాజధాని నిర్మాణమే జరుగుతోంది. దాన్ని ఎవరూ వ్యతిరేకించడం లేదు. కానీ విశాఖ రైల్వే జోన్‌ కూడా తమకే కావాలంటే అందులో న్యాయముందా?. అలా అడగడంతో అర్థముందా?. రాయపాటి మీద ఏమో గానీ ఇలా ప్రాంతాల మధ్య విధ్వేషాలు రెచ్చగొట్టకుండా పార్టీ ప్రతినిధులను కట్టడిచేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఉందనిపిస్తోంది.

Tags:    
Advertisement

Similar News