లోకేష్ వ్యూహాత్మక వెనుకడుగు

రాజకీయాల్లో దేనికైనా టైమింగ్‌ ముఖ్యం. తొందరపడి స్టెప్ వేస్తే తిరిగి దాన్ని వెనుక్కు తీసుకోలేం.ఇప్పుడు లోకేష్ కూడా ఈ సూత్రం ఆధారంగానే ముందుకెళ్తున్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల విషయంలో వైరిపక్షాలు రెచ్చగొడుతున్నా లోకేష్‌ మాత్రం మౌనంగా ఉంటున్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు వీలైనంత దూరంగా ఉండాలని భావిస్తున్నారు. చినబాబు నిర్ణయం సరైనదేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎందుకంటే గ్రేటర్ పరిధిలో సీమాంధ్రులు ఎక్కువగానే ఉన్నా… వారంతా మొన్నటి ఎన్నికల్లోలాగా టీడీపీకి గంపగుత్తగా ఓట్లేసే పరిస్థితి కనిపించడం లేదు. ఎందుకంటే జరుగుతున్న స్థానిక […]

Advertisement
Update:2016-01-10 05:00 IST

రాజకీయాల్లో దేనికైనా టైమింగ్‌ ముఖ్యం. తొందరపడి స్టెప్ వేస్తే తిరిగి దాన్ని వెనుక్కు తీసుకోలేం.ఇప్పుడు లోకేష్ కూడా ఈ సూత్రం ఆధారంగానే ముందుకెళ్తున్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల విషయంలో వైరిపక్షాలు రెచ్చగొడుతున్నా లోకేష్‌ మాత్రం మౌనంగా ఉంటున్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు వీలైనంత దూరంగా ఉండాలని భావిస్తున్నారు. చినబాబు నిర్ణయం సరైనదేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎందుకంటే గ్రేటర్ పరిధిలో సీమాంధ్రులు ఎక్కువగానే ఉన్నా… వారంతా మొన్నటి ఎన్నికల్లోలాగా టీడీపీకి గంపగుత్తగా ఓట్లేసే పరిస్థితి కనిపించడం లేదు. ఎందుకంటే జరుగుతున్న స్థానిక ఎన్నికలు కావడంతో తమ ఏరియాలో మౌలికసదుపాయాల అభివృద్ధి కోణంలో ఓటర్లు ఓటేసే అవకాశం ఉంది.

ఈ నేపథ్యంలో ఓటరు నాడిని ఏ పార్టీ కూడా పూర్తి స్థాయిలో పట్టుకోలేకపోతోంది. గెలుపు తమదేనని చెబుతున్నా అధికారపార్టీలోనూ ఓ మూల అనుమానం ఉంది. ఇప్పుడు లోకేష్ విషయం తీసుకున్నా అదేపరిస్థితి. లోకేష్ ఇప్పటి వరకు నేరుగా ఎన్నికల్లో పాల్గొనడం గానీ… తమ పార్టీ అభ్యర్థులను ముందుండి గెలిపించిన ఉదంతం గానీ లేదు. ఇప్పుడు జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేస్తే… అయినప్పటికీ పార్టీ అభ్యర్థులు ఓడిపోతే కారణాలు ఏవైనా సరే ఆ నిందను మాత్రం లోకేష్ బాబు మీదకే నెడుతారు. టీడీపీ వ్యతిరేకులంతా లోకేష్ తొలిపరీక్షలో ఫెయిల్ అయ్యారంటూ ప్రచారం చేసే అవకాశం ఉంది. భవిష్యత్తులో పార్టీకే అధ్యక్షుడు కావాలనుకుంటున్న చినబాబుకు ఈ పరిణామం ఇబ్బందిపెట్టే చాన్స్ ఉంటుంది. కాబట్టే జీహెచ్‌ఎంసీ ఎన్నికల విషయంలో లోకేష్ వ్యూహాత్మకంగా వెనక్కు తగ్గారని చెబుతున్నారు.

కొద్ది రోజుల క్రితం జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై పార్టీ నేతలతో లోకేష్ సమావేశం నిర్వహించారు. అప్పటి నుంచే జీహెచ్‌ఎంసీ పోరును అటు కేటీఆర్, ఇటు లోకేష్ మధ్య పోరుగా చూడడం మొదలుపెట్టారు. అయితే వెంటనే అప్రమత్తమైన టీడీపీ వ్యూహకర్తలు లోకేష్‌ గైడ్ చేశారు.

Click to Read:

Tags:    
Advertisement

Similar News