నందమూరి వార్- థియేటర్ల బలవంతపు సేకరణ

నందమూరి వారసులు సినిమా పోరు ముదిరి పాకానపడింది. సంక్రాంతి బరిలో బాలయ్య డిక్టేటర్, ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో విడుదలవుతున్నాయి. పేరుకు సినిమాలే అయినా ఇదికాస్త రాజకీయ రంగుపులుముకుంది. ఎన్టీఆర్ సినిమా హిట్ అయితే దాని ప్రభావం రాజకీయంగానూ ఉంటుందని భావించిన టీడీపీ నేతలు బాలయ్యకు మద్దతుగా రంగంలోకి దిగారు. మామ తరపున రంగంలోకి దిగిన లోకేష్ అయా జిల్లా నేతల ద్వారా థియేటర్ల యజమానులపై ఒత్తిడి తెస్తున్నారని ఎన్టీఆర్ అభిమానులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే ”నాన్నకు ప్రేమతో” పేరున […]

Advertisement
Update:2016-01-09 03:26 IST

నందమూరి వారసులు సినిమా పోరు ముదిరి పాకానపడింది. సంక్రాంతి బరిలో బాలయ్య డిక్టేటర్, ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో విడుదలవుతున్నాయి. పేరుకు సినిమాలే అయినా ఇదికాస్త రాజకీయ రంగుపులుముకుంది. ఎన్టీఆర్ సినిమా హిట్ అయితే దాని ప్రభావం రాజకీయంగానూ ఉంటుందని భావించిన టీడీపీ నేతలు బాలయ్యకు మద్దతుగా రంగంలోకి దిగారు. మామ తరపున రంగంలోకి దిగిన లోకేష్ అయా జిల్లా నేతల ద్వారా థియేటర్ల యజమానులపై ఒత్తిడి తెస్తున్నారని ఎన్టీఆర్ అభిమానులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే ”నాన్నకు ప్రేమతో” పేరున బుక్ అయిన థియేటర్లు అధికార పార్టీ ఒత్తిళ్ల దెబ్బకు డిక్టేటర్‌కు మారుతున్నాయి. ప్రకాశం జిల్లా కందుకూరులో రెండు కీలక థియేటర్లు ”నాన్నకు ప్రేమతో” సినిమా పేరున బుక్ అవగా ఎట్టిపరిస్థితుల్లోనూ ఆ రెండు థియేటర్లలో ”డిక్టేటర్” ఆడించాలని టీడీపీ నేతలు థియేటర్ల యజమానులపై ఒత్తిడి తెస్తున్నారు.

నెల్లూరు, కృష్ణా,గుంటూరు జిల్లాల్లోనూ ఇదే రకమైన ఒత్తిళ్లు వస్తున్నాయని ఎన్టీఆర్ అభిమానులు ఆవేదన చెందుతున్నారు. రాయలసీమలో ”నాన్నకు ప్రేమతో” సినిమా కంటే దాదాపు 40 థియేటర్లు బాలయ్య చిత్రానికే ఎక్కువగా బుక్ అయ్యాయి. అయినప్పటికీ మిగిలిన థియేటర్లను కూడా ”డిక్టేటర్‌”కే కేటాయించాలని టీడీపీ నేతలు ఒత్తిడి తెస్తున్నారని సమాచారం. గోదావరి జిల్లాల్లో మాత్రం ఈ ఒత్తిళ్లు పనిచేయడంలేదని చెబుతున్నారు. రెండు జిల్లాల్లో ”నాన్నకు ప్రేమతో” చిత్రానికి థియేటర్లు బాగా దొరికాయని చెబుతున్నారు.

టీడీపీ నేతలు ఒత్తిళ్లు తెచ్చినా థియేటర్ల యజమానులు మాత్రంలెక్కచేయడం లేదని చెబుతున్నారు. తమ ప్రాంతంలో బాలకృష్ణ చిత్రాలకంటే ఎన్టీఆర్ చిత్రాలకు కలెక్షన్లు బాగుంటాయని థియేటర్ యజమానులు చెబుతుండడం విశేషం. అయితే ఈ పరిణామంపై నందమూరి అభిమానులు ఆవేదన చెందుతున్నారు. ఏ సినిమా బాగుంటే ప్రజలు ఆ సినిమానే ఆదరిస్తారని అనవసర పోటీని సృష్టించుకోవడం సరికాదంటున్నారు. ఏ సినిమా ఎలా ఆడుతుందో విడుదలకు ముందే ఊహించడం సాధ్యం కాదని.. కాబట్టి ఇలాంటి విపరీత పోటీ ధోరణి వల్ల సినిమా దెబ్బతింటే సదరు హీరో భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం ఉంటుందని ఆందోళన చెందుతున్నారు.

Click to Read:

Tags:    
Advertisement

Similar News