డిక్టేటర్ కోసం కొత్త ప్రచార ఎత్తుగడ
తమ సినిమా పబ్లిసిటీ కోసం… ఎన్ని రకాలైన ఎత్తుగడలైనా వేస్తారు సినిమాల వాళ్లు. విడుదలకు ముందు దాని హైప్ ను పెంచడానికి వీళ్లు తమ బుర్రలకు పదును పెడుతూ ఉంటారు. ఈ ప్రయత్నాల్లో సినిమా వాళ్లు వేసే ఎత్తులపై ప్రేక్షకులకందరికీ క్లారిటీ ఉండనే ఉంటుంది. ఈ నేపథ్యంలో బాలయ్య తాజా సినిమా “డిక్టేటర్” విషయంలో కొన్ని ఆసక్తికరమైన అనుమానాలు వస్తున్నాయి. ఈ సినిమాను రీమేక్ చేయడానికి ఇతర భాషల హీరోలు ముందుకొస్తున్నారనే ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. ముందుగా […]
తమ సినిమా పబ్లిసిటీ కోసం… ఎన్ని రకాలైన ఎత్తుగడలైనా వేస్తారు సినిమాల వాళ్లు. విడుదలకు ముందు దాని హైప్ ను పెంచడానికి వీళ్లు తమ బుర్రలకు పదును పెడుతూ ఉంటారు. ఈ ప్రయత్నాల్లో సినిమా వాళ్లు వేసే ఎత్తులపై ప్రేక్షకులకందరికీ క్లారిటీ ఉండనే ఉంటుంది. ఈ నేపథ్యంలో బాలయ్య తాజా సినిమా “డిక్టేటర్” విషయంలో కొన్ని ఆసక్తికరమైన అనుమానాలు వస్తున్నాయి. ఈ సినిమాను రీమేక్ చేయడానికి ఇతర భాషల హీరోలు ముందుకొస్తున్నారనే ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు.
ముందుగా అజయ్ దేవగణ్ ఓకే చేశాడని, ఇప్పడు అజిత్ ఓకే చేశాడని లీకులు వదిలారు. ఈ సినిమాను ఇప్పటికే ఆ హీరోల ప్రతినిధులు చూసేశారని.. రీమేక్ చేయడానికి తెగ ఉత్సాహం చూపిస్తున్నారని.. హిందీలో అజయ్ దేవగణ్, తమిళంలో అజిత్ లు హీరోలుగా నటించబోయే తర్వాతి సినిమా ‘డిక్టేటర్’ కు రీమేకే.. అని ప్రచారం చేస్తున్నారు. అయితే ఏ హీరో అయినా… ఒక సినిమా హిట్ అయ్యిందంటేనే రీమేక్ లకు ముందుకొస్తారు. విడుదలకు ముందే రీమేక్ లకు కమిట్ కావడం దాదాపుగా ఎవరూ చేయరు!
అయితే బాలయ్య సినిమా విషయంలో మాత్రం ఈ లీకులుచ్చేశారు. మరి ఇదంతా తమ సినిమాపై హైప్ ను పెంచుకునే ప్రయత్నమేనని.. విడుదలకు ముందే సినిమాను రీమేక్ చేయడానికి చాలామంది హీరోలు రెడీ అవుతున్నారని ప్రచారం చేసుకుంటే.. జనాల్లో దీనిపై ఆసక్తి పెరుగుతుందనేది ‘డిక్టేటర్’ రూపకర్తల వ్యూహం అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అజిత్ , అజయ్ దేవగణ్ ల పేరుతో ‘డిక్టేటర్’ పై హైప్ ను పెంచే యత్నం చేస్తున్నారని అంటున్నారు. మరి అసలు కథ ఏమిటో.. ‘డిక్టేటర్’ విడుదలయ్యకా కానీ క్లారిటీ రాదు. ఎన్ని ఎత్తులు వేసినా.. సినిమా మొదటి షో అభిమానులకు నచ్చక పోతే అంతే సంగతులు అనేది తెలిసిన విషయమే.!