తమ్ముడి సినిమాలో అన్నయ్య అతిధి
చిరంజీవి-పవన్ కల్యాణ్ మధ్య మనస్పర్ధలు ఉన్నాయనే విషయం బహిరంగ రహస్యం. అయితే ప్రతిసారి ఆ విషయాన్ని మెగా కాంపౌండ్ ఖండిస్తూనే ఉంది. కానీ పైకి కనిపిస్తున్న సన్నివేశాలు మాత్రం వాళ్ల మధ్య గ్యాప్ ను బయటపెడుతూనే ఉన్నాయి. ఈమధ్య పవన్ కాస్త చొరవ చూపించి… చిరుకు దగ్గరయ్యే ప్రయత్నం చేశారు. షష్టిపూర్తి నుంచి మొన్నటి చరణ్ సినిమా విడుదల వరకు చాలా అంశాల్లో పవన్ కల్పించుకున్నారు. అయినా కొందర్లో కొన్ని డౌట్స్ అలానే ఉన్నాయి. దీంతో ఓ […]
Advertisement
చిరంజీవి-పవన్ కల్యాణ్ మధ్య మనస్పర్ధలు ఉన్నాయనే విషయం బహిరంగ రహస్యం. అయితే ప్రతిసారి ఆ విషయాన్ని మెగా కాంపౌండ్ ఖండిస్తూనే ఉంది. కానీ పైకి కనిపిస్తున్న సన్నివేశాలు మాత్రం వాళ్ల మధ్య గ్యాప్ ను బయటపెడుతూనే ఉన్నాయి. ఈమధ్య పవన్ కాస్త చొరవ చూపించి… చిరుకు దగ్గరయ్యే ప్రయత్నం చేశారు. షష్టిపూర్తి నుంచి మొన్నటి చరణ్ సినిమా విడుదల వరకు చాలా అంశాల్లో పవన్ కల్పించుకున్నారు. అయినా కొందర్లో కొన్ని డౌట్స్ అలానే ఉన్నాయి. దీంతో ఓ విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నాడట పవన్. తన సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలో చిరంజీవితో కలిసి ఓ సీన్ లో నటించడానికి రెడీ అవుతున్నాడట.
ప్రస్తుతం చిరంజీవి 150వ సినిమా కోసం కసరత్తు చేస్తున్నాడు. ఈ సినిమా సెట్స్ పైకి వచ్చేలోపే…. పవన్ సినిమాలో ఓ గెస్ట్ రోల్ లో కనిపించాలని చిరంజీవి భావిస్తున్నాడు. ఇప్పటికే చరణ్ నటించిన బ్రూస్ లీ కోసం గెస్ట్ గా అవతారమెత్తిన చిరంజీవి… ఇప్పుడు పవన్ సినిమాల్లో కూడా కనిపించడానికి సిద్ధమౌతున్నారని టాక్. దీని వల్ల రెండు ఉపయోగాలున్నాయి. ఒకటి చిరంజీవి 150వ సినిమాకు ఈ గెస్ట్ ఎప్పీయరెన్స్ బాగా పనికొస్తుంది. రెండోది…. చిరు-పవన్ బాగా కలిసిపోయారనే సందేశం ప్రజల్లోకి వెళ్తుంది.
Advertisement