కమ్యూనిస్ట్‌పై కుల ప్రయోగం

తమను వ్యతిరేకించే వారిని ఎక్కడ కొట్టాలో టీడీపీకి బాగా తెలుసంటున్నారు సీపీఎం నేతలు. తమ వైపు నుంచి తప్పు జరిగినప్పుడు సమర్ధించకపోయినా పర్వాలేదు గానీ.. వ్యతిరేకించకూడదన్న విధంగా టీడీపీ నేతలు బ్లాక్‌మెయిల్‌కు దిగుతున్నారని వ్యాఖ్యానిస్తున్నారు. తాజాగా టీడీపీ నేతలు సీపీఎం ఏపీ కార్యదర్శి మధును టార్గెట్ చేశారు. తమకు అనుకూలమైన మీడియా ద్వారా ఆయనపై ఏకంగా కులం రంగు పూస్తున్నారు. మధు చేసిన తప్పు ఏమిటంటే ఏపీ ప్రభుత్వ విధానాలను విమర్శించడమేనట. రాజధాని భూసమీకరణ, ధరల పోటు, […]

Advertisement
Update:2016-01-08 02:36 IST

తమను వ్యతిరేకించే వారిని ఎక్కడ కొట్టాలో టీడీపీకి బాగా తెలుసంటున్నారు సీపీఎం నేతలు. తమ వైపు నుంచి తప్పు జరిగినప్పుడు సమర్ధించకపోయినా పర్వాలేదు గానీ.. వ్యతిరేకించకూడదన్న విధంగా టీడీపీ నేతలు బ్లాక్‌మెయిల్‌కు దిగుతున్నారని వ్యాఖ్యానిస్తున్నారు. తాజాగా టీడీపీ నేతలు సీపీఎం ఏపీ కార్యదర్శి మధును టార్గెట్ చేశారు. తమకు అనుకూలమైన మీడియా ద్వారా ఆయనపై ఏకంగా కులం రంగు పూస్తున్నారు. మధు చేసిన తప్పు ఏమిటంటే ఏపీ ప్రభుత్వ విధానాలను విమర్శించడమేనట.

రాజధాని భూసమీకరణ, ధరల పోటు, అవినీతి, అసెంబ్లీ నుంచి రోజా సస్పెన్షన్ ఇలా చాలా విషయాల్లో ఆయన ప్రభుత్వ తీరును గట్టిగా విమర్శిస్తున్నారు. దీంతో ఈయన కట్టడికి టీడీపీ కొత్త ఎత్తు వేసిందని చెబుతున్నారు. తన కులం పేరును కూడా పేరు చివర అతికించుకునేందుకు ఇష్టపడని మధు కులాన్ని తెరపైకి తెస్తున్నారు. జగన్‌, మధు ఇద్దరిదీ ఒకే సామాజికవర్గం కాబట్టి వైసీపీకి మద్దతుగా మధు మాట్లాడుతున్నారని ప్రచారం మొదలుపెట్టారు.

జగన్‌ మీద మధుకు అంత ప్రేమ ఉంటే వైసీపీలో చేరిపోవాలని కమ్యూనిస్టులతో పాటు టీడీపీ నేతలు కూడా వ్యాఖ్యానిస్తున్నారంటూ టీడీపీ మద్దతు మీడియా కథనాలు రాస్తోంది. ఈ పరిణామంతో మధు అనుచరులు తీవ్రంగా నొచ్చుకుంటున్నారు. మధుకు కులం రంగు పులమడం కన్నా నీచమైన పని ఏమైనా ఉంటుందా అని ప్రశ్నిస్తున్నారు. రోజా సస్పెన్షన్‌ వ్యతిరేకించారు కాబట్టి కులం ప్రస్తావన తెస్తున్నారు. మరి చంద్రబాబును సీపీఐ కార్యదర్శితో పాటు కమ్యూనిస్టులు సీనియర్ నేతలు నారాయణ, లోక్ సత్తా నేత జేపి, సిపిఎం నేత రాఘవులు, వంటి వారు కూడా విమర్శలు చేస్తున్నారు కదా. మరి వారి సంగతేంటని ప్రశ్నిస్తున్నారు. వారంతా చంద్రబాబు సామాజికవర్గం నేతలు కాబట్టి తిట్టినా తప్పులేదా అని ప్రశ్నిస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News