ఈ చిన్నారిని చూసి నేర్చుకోండయ్యా!- మురిసిన బాబు

పశ్చిమగోదావరి ఇల్లా జన్మభూమి కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబును ఒక చిన్నారి అమితంగా ఆకట్టుకుంది. అమ్మాయి తీరును మెచ్చిన సీఎం ఏకంగా అప్పటికప్పుడు ట్యాబ్ తెచ్చి బహుమతిగా ఇచ్చారు. మరుగుదొడ్ల అవసరంపై రాజేశ్వరి అనే చిన్నారి వేదికపై అనర్గళంగా మాట్లాడింది. అన్ని వేలమంది ముందు, సీఎం సమక్షంలో ధైర్యంగా చిన్నారి మాట్లాడిన తీరు చూసి నాయకులు కూడా ఆశ్చర్యపోయారు. చిన్నారి ప్రసంగం ముగిసిన తర్వాత ఆమెను చంద్రబాబు దగ్గరకు పిలుచుకుని కాసేపు ముచ్చటించారు. ప్రతిభకు పేదరికం అడ్డుకాదన్నదానికి రాజేశ్వరి […]

Advertisement
Update:2016-01-08 12:13 IST

పశ్చిమగోదావరి ఇల్లా జన్మభూమి కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబును ఒక చిన్నారి అమితంగా ఆకట్టుకుంది. అమ్మాయి తీరును మెచ్చిన సీఎం ఏకంగా అప్పటికప్పుడు ట్యాబ్ తెచ్చి బహుమతిగా ఇచ్చారు. మరుగుదొడ్ల అవసరంపై రాజేశ్వరి అనే చిన్నారి వేదికపై అనర్గళంగా మాట్లాడింది. అన్ని వేలమంది ముందు, సీఎం సమక్షంలో ధైర్యంగా చిన్నారి మాట్లాడిన తీరు చూసి నాయకులు కూడా ఆశ్చర్యపోయారు.

చిన్నారి ప్రసంగం ముగిసిన తర్వాత ఆమెను చంద్రబాబు దగ్గరకు పిలుచుకుని కాసేపు ముచ్చటించారు. ప్రతిభకు పేదరికం అడ్డుకాదన్నదానికి రాజేశ్వరి ఒక ఉదాహరణ అని చంద్రబాబు మెచ్చుకున్నారు. ”మా లీడర్లు కూడా ఇంత బాగా మాట్లాడలేరు” అని చిన్నారికి కితాబు ఇచ్చారు. భవిష్యత్తులో ఏం కావాలనుకుంటున్నావ్ అని రాజేశ్వరిని ప్రశ్నించగా ఐఏఎస్ అని సమాధానం చెప్పింది. ఇందుకు చంద్రబాబు నవ్వుతూ ”రాజకీయాల్లోకి రావాలని లేదా” అని అడిగారు. అలాంటి కోరిక లేదనగా ”ఏం ! ఇక్కడున్న ఒక్క నాయకుడు కూడా నీలో స్పూర్తి నింపలేదా” అని అన్నారు. దీంతో అందరూ నవ్వారు. చిన్నారి ప్రతిభకు ఆనందించిన చంద్రబాబు అప్పటికప్పుడు రాజేశ్వరికి ఒక ట్యాబ్ బహుమతిగా ఇస్తున్నట్టు ప్రకటించారు. సీఎం ప్రకటించిన వెంటనే కలెక్టర్‌ దాన్ని సమకూర్చారు. దీంతో వేదికపైనే చిన్నారి రాజేశ్వరికి చంద్రబాబు ట్యాబ్ అందజేశారు.

Tags:    
Advertisement

Similar News