రంగంలోకి దిగిన లోకేష్

ఎన్నడూ లేని విధంగా నందమూరి హీరోలు నటసింహం బాలకృష్ణ, యంగ్ టైగర్ ఎన్టీఆర్ మధ్య సంక్రాంతి పోటీ నడుస్తోంది. అది సినిమాల వరకే పరిమితం అయి ఉంటే సమస్య లేదు. కానీ ఎవరి సినిమా హిట్ అయితే వారిదే పైచేయి అన్నట్టుగా పరిస్థితి తయారైంది. ఎన్టీఆర్‌ది పైచేయి అయితే దాని ప్రభావం రాజకీయంగానూ ఉంటుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సినీవార్‌లోకి లోకేష్ ఎంటరయ్యారని చెబుతున్నారు. నేరుగా ఎగ్జిబిటర్లు, డిస్టిబ్యూటర్లకు ఫోన్ చేసి నాన్నకు ప్రేమతో విషయంలో మరీ […]

Advertisement
Update:2016-01-08 05:45 IST

ఎన్నడూ లేని విధంగా నందమూరి హీరోలు నటసింహం బాలకృష్ణ, యంగ్ టైగర్ ఎన్టీఆర్ మధ్య సంక్రాంతి పోటీ నడుస్తోంది. అది సినిమాల వరకే పరిమితం అయి ఉంటే సమస్య లేదు. కానీ ఎవరి సినిమా హిట్ అయితే వారిదే పైచేయి అన్నట్టుగా పరిస్థితి తయారైంది. ఎన్టీఆర్‌ది పైచేయి అయితే దాని ప్రభావం రాజకీయంగానూ ఉంటుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సినీవార్‌లోకి లోకేష్ ఎంటరయ్యారని చెబుతున్నారు. నేరుగా ఎగ్జిబిటర్లు, డిస్టిబ్యూటర్లకు ఫోన్ చేసి నాన్నకు ప్రేమతో విషయంలో మరీ ఎక్కువగా ఇన్వాల్వ్ కావద్దని చెబుతున్నారని ఎన్టీఆర్ వర్గం ఆఫ్‌లైన్‌లో చెబుతోంది. పరోక్షంగా ఎన్టీఆర్‌ సినిమా ఆడేందుకు సహకరించవద్దని లోకేష్ చెబుతున్నారట.

ఎన్టీఆర్‌ బలపడితే భవిష్యత్తులో రాజకీయంగా పోటీగా మారుతారన్న అనుమానం లోకేష్‌లో ఉందని అందుకే ఇలా చేస్తున్నారని చెబుతున్నారు. మరీ ముఖ్యంగా ఆంధ్రా, సిడెడ్‌ డిస్టిబ్యూటర్లపై బాలయ్య వర్గం నుంచి ఒత్తిడి ఉందని చెబుతున్నారు. నైజాం విషయంలో మాత్రం అంత పట్టుదలగా బాలయ్య, లోకేష్ లేరని చెబుతున్నారు. అంటే ఆంధ్రా, సీడెడ్‌లో ఎన్టీఆర్‌ ప్రభావం పెరిగితే రాజకీయంగా ఇబ్బంది వస్తుందన్నది వారి భావన అయి ఉండవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Click to Read:

Tags:    
Advertisement

Similar News