చంద్రబాబు రెండు కులాలకూ న్యాయం చేశారు- సుమన్‌

కాపులను బీసీల్లోకి చేర్చాలన్న డిమాండ్‌పై నటుడు, ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు బీసీ సంఘాల గౌరవాధ్యక్షుడు సుమన్ స్పందించారు. కాపులను బీసీల్లో చేర్చితే తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. అయితే తమిళనాడు, కర్నాటక తరహాలో ఏపీలోనూ బీసీ రిజర్వేషన్ల శాతం మరో 15 శాతం పెంచాలని సూచించారు. అలా చేసి కాపులను బీసీల్లో చేర్చితే ఇబ్బంది ఉండదన్నారు. ఆర్థికంగా వెనుకబడిన అన్ని వర్గాలకు రిజర్వేషన్లు వర్తింపచేయాలని కోరారు. కేఈ కృష్ణమూర్తి, చినరాజప్ప లకు డిప్యూటీ సీఎం పదవులు ఇవ్వడం […]

Advertisement
Update:2016-01-07 06:50 IST

కాపులను బీసీల్లోకి చేర్చాలన్న డిమాండ్‌పై నటుడు, ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు బీసీ సంఘాల గౌరవాధ్యక్షుడు సుమన్ స్పందించారు. కాపులను బీసీల్లో చేర్చితే తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. అయితే తమిళనాడు, కర్నాటక తరహాలో ఏపీలోనూ బీసీ రిజర్వేషన్ల శాతం మరో 15 శాతం పెంచాలని సూచించారు. అలా చేసి కాపులను బీసీల్లో చేర్చితే ఇబ్బంది ఉండదన్నారు. ఆర్థికంగా వెనుకబడిన అన్ని వర్గాలకు రిజర్వేషన్లు వర్తింపచేయాలని కోరారు. కేఈ కృష్ణమూర్తి, చినరాజప్ప లకు డిప్యూటీ సీఎం పదవులు ఇవ్వడం ద్వారా చంద్రబాబు రెండు కులాలకు న్యాయం చేశారని సుమన్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం చంద్రబాబు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ప్రస్తుతానికి సినీ పరిశ్రమ హైదరాబాద్‌లోనే ఉండడం మంచిదన్నారు. ఏపీలో సినీ పరిశ్రమకు అవసరమైన మౌలిక సదుపాయల కొరత ఉందన్నారు.

Tags:    
Advertisement

Similar News