కేజ్రీవాల్ క్రేజ్‌పై నెట్టింట కుట్రలు
ఢిల్లీలో బీజేపీ ఓటమిని నరేంద్రమోడీ జీర్ణించుకున్నా బీజేపీ అభిమానులు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా బీజేపీని అభిమానించే కొందరు నెటిజన్‌లు కేజ్రీవాల్‌ని వ్యక్తిగతంగా టార్గెట్‌చేసుకుని సోషల్‌మీడియాలో నిరంతరం బురదచల్లుతుండడం చర్చనీయాంశమైంది. ఢిల్లీతోపాటు రెండు, మూడు రాష్ట్రాల్లో బీజేపీ ఓడిపోయినా అక్కడి ముఖ్యమంత్రులమీద ఇంతగా కసిపెంచుకోలేదు. కేజ్రీవాల్ నీతి, నిజాయితీ బీజేపీ అభిమానులకు మింగుడుపడుతున్నట్టులేదు. బహుశా అందుకే ఇంత నీచానికి దిగజారి కేజ్రీవాల్ వ్యతిరేక ప్రచారానికి పూనుకుంటున్నారు. మొదటిసారి కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన సమయంలో ఆయన కూతురి […]
ఢిల్లీలో బీజేపీ ఓటమిని నరేంద్రమోడీ జీర్ణించుకున్నా బీజేపీ అభిమానులు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా బీజేపీని అభిమానించే కొందరు నెటిజన్‌లు కేజ్రీవాల్‌ని వ్యక్తిగతంగా టార్గెట్‌చేసుకుని సోషల్‌మీడియాలో నిరంతరం బురదచల్లుతుండడం చర్చనీయాంశమైంది. ఢిల్లీతోపాటు రెండు, మూడు రాష్ట్రాల్లో బీజేపీ ఓడిపోయినా అక్కడి ముఖ్యమంత్రులమీద ఇంతగా కసిపెంచుకోలేదు. కేజ్రీవాల్ నీతి, నిజాయితీ బీజేపీ అభిమానులకు మింగుడుపడుతున్నట్టులేదు. బహుశా అందుకే ఇంత నీచానికి దిగజారి కేజ్రీవాల్ వ్యతిరేక ప్రచారానికి పూనుకుంటున్నారు.
కేజ్రీవాల్ తన సోదరికి నెలకు లక్షా పదిహేనువేల జీతంతో సెక్రెటేరియట్‌లో ఉద్యోగం ఇచ్చాడని, అది కూడా సచివాలయానికి వచ్చీపోయి వారి పేర్లు రాసుకునే ఉద్యోగమని అందుకే ఏకంగా లక్ష పదిహేను వేల జీతం చెల్లిస్తున్నారంటూ పోస్టులు పెడుతున్నారు. అయితే ఇక్కడో విషయం గమనించాలి. ముఖ్యమంత్రే కాదు ప్రధానమంత్రి కూడా అంత జీతంతో సెక్రెటేరియట్‌లో ఉద్యోగం ఇప్పించుకోలేరు. సందర్శకుల పేర్లు రాసుకునే పాటి చిన్న ఉద్యోగానికి లక్షా పదిహేనువేల జీతం ఉంటుందా? బురదచల్లినా అర్ధం ఉండాలి. నిజంగానే కేజ్రీవాల్ అలాంటి బంధుప్రీతికి అవకాశం ఇచ్చి ఉంటే బీజేపీ ప్రభుత్వం ఎన్ని సీబీఐ దాడులు జరిపించిఉండేదో!.
రెండురోజులనుంచి కేజ్రీవాల్‌మీద మరోదాడి ప్రారంభమైంది. ఢిల్లీలో ట్రాఫిక్ నియంత్రణకు వాహనాల సరి, బేసి సంఖ్యల ఆధారంగా అనుమతించే విధానం ప్రవేశపెట్టాక మెట్రో రైల్వేస్టేషన్లలో జనం కిక్కిరిసి పోయారని, ప్రజలు నానా బాధలు పడుతున్నారని రాస్తూ ఎక్కడివో ఫొటోలు తెచ్చి ఇవి ఢిల్లీ మెట్రోస్టేషన్ల ఫొటోలని ఫేసుబుక్కుల్లో పెడుతున్నారు. కానీ జనంతో కిక్కిరిపోయిన రైలు చిత్రం ఇప్పటిది కాదని తేలింది. దీపావళి సమయంలో ఆ ఫోటోను ప్రచురించిన ప్రముఖ ఇంగ్లీష్ దినపత్రికే స్వయంగా ఆ విషయాన్ని తెలియజేసింది. దీంతో సాధారణ నెటిజన్లు కూడా అవాక్కయ్యారు. అంటే ఒక బ్యాచ్ పనిగట్టుకుని సోషల్ మీడియాలో కేజ్రీవాల్ క్రేజ్‌ను దెబ్బతీయడానికి పనిచేస్తోందన్న మాట. ఇలాంటి అసత్య ప్రచారం విషయంలో నెటిజన్లు జాగ్రత్తగా ఉండాలని నిజానిజాలు బేరీజు వేసుకోవాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Heavy rush at Delhi's Rajiv Chowk Metro Station on the eve of Diwali. (Photo: Sunil Saxena/Hindustan Times) #ht pic.twitter.com/2kwKF0r2CY
— Hindustan Times (@htTweets) October 22, 2014