హైడ్రోజన్ బాంబు- రిక్టర్ స్కేల్‌పై వణికిన భూమి
ఉత్తరకొరియా తమ అణుశక్తిని మరోసారి ప్రపంచానికి చాటిచెప్పే ప్రయత్నం చేసింది. తాజాగా హైడ్రోజన్ బాంబును పేల్చి పరీక్షించింది. బాంబును విజయవంతంగా ప్రయోగించామని ఉత్తరకొరియా బహిరంగంగా ప్రకటించి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. హైడ్రోజన్ బాంబు పరీక్షించిన ఉత్తరకొరియా ఈశాన్య ప్రాంతం కంపించిపోయింది. రిక్టర్ స్కేల్‌పై దాని తీవ్రత 5.1గా నమోదైంది. తొలుత దీన్ని భూకంపంగా భావించారు. కానీ ఉత్తరకొరియా అధికారికంగా తాము హైడ్రోజన్ బాంబును పరీక్షించామని చెప్పడంతో అసలు విషయం అర్థమైంది.