ఆ ముహూర్తం రాదా ?

కడప జిల్లా జమ్మలమడుగులో పులిలా బతికిన ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి పరిస్థితి ఇప్పుడు ఎటూకాకుండా తయారవుతోంది. ఆదినారాయణరెడ్డి టీడీపీలో చేరేందుకు పార్టీ అధినాయకత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని ప్రచారం జరిగింది. దుర్ముహుర్తం పోవడమే ఆలస్యం ఆది సైకిల్ ఎక్కేస్తారని ఓ రేంజ్‌లో పబ్లిసిటీ జరిగిపోయింది. ఆదినారాయణరెడ్డి టీడీపీలోకి వెళ్తున్నారు కాబట్టి టీడీపీ నేత రామసుబ్బారెడ్డి వైసీపీలోకి వస్తారన్న ఒక నిర్ధారణకు కూడా అందరూ వచ్చేశారు. చివరకు ఆదినారాయణరెడ్డి కూడా మొహమాటం పక్కన పెట్టి తాను టీడీపీలో చేరేందుకు సిద్ధమని… […]

Advertisement
Update:2016-01-06 02:30 IST

కడప జిల్లా జమ్మలమడుగులో పులిలా బతికిన ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి పరిస్థితి ఇప్పుడు ఎటూకాకుండా తయారవుతోంది. ఆదినారాయణరెడ్డి టీడీపీలో చేరేందుకు పార్టీ అధినాయకత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని ప్రచారం జరిగింది. దుర్ముహుర్తం పోవడమే ఆలస్యం ఆది సైకిల్ ఎక్కేస్తారని ఓ రేంజ్‌లో పబ్లిసిటీ జరిగిపోయింది. ఆదినారాయణరెడ్డి టీడీపీలోకి వెళ్తున్నారు కాబట్టి టీడీపీ నేత రామసుబ్బారెడ్డి వైసీపీలోకి వస్తారన్న ఒక నిర్ధారణకు కూడా అందరూ వచ్చేశారు. చివరకు ఆదినారాయణరెడ్డి కూడా మొహమాటం పక్కన పెట్టి తాను టీడీపీలో చేరేందుకు సిద్ధమని… ఇక ఎప్పుడు చేరాలన్న ముహూర్తం నిర్ణయించాల్సింది చంద్రబాబే అని కూడా ప్రకటించారు. అయినా టీడీపీ నుంచి ఎలాంటి స్పందన లేదు.

కడప జిల్లాలో పర్యటించిన జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి గంటా శ్రీనివాసరావును ఈ విషయంపై ప్రశ్నించగా చాలా అమాయకంగా సమాధానం చెప్పారు. మేమేమైనా పార్టీలోకి రావాల్సిందిగా ఆదినారాయణరెడ్డిని ఆహ్వానించామా? టీడీపీలో చేరాలని కోరామా? అని మీడియా ప్రతినిధులనే ఎదురు ప్రశ్నించారు. అంతేకాదు మీడియా వాళ్లే ఇలాంటి వార్తలు రాసుకుంటున్నారని నిందను మీడియాపై నెట్టేసి వెళ్లిపోయారు. గంటా వ్యాఖ్యలు ఇప్పుడు ఆదినారాయణరెడ్డి వర్గీయులకు రుచించడం లేదు. టీడీపీని నమ్ముకుని వైసీపీ నుంచి చాప దుప్పటి సర్దుకుని రోడ్డుమీదకు వచ్చిన తర్వాత ఇలా మాట్లాడడం ఏమిటని అవాక్కవుతున్నారు. ఆదిని పార్టీలోకి చేర్చుకునే విషయంలో టీడీపీ వెనక్కు తగ్గిందా అన్న అనుమానం వ్యక్తమవుతోంది. ఆది వస్తే రామసుబ్బారెడ్డి వైసీపీలోకి వెళ్లిపోతారనే ఉద్దేశంతో వెనుకడుగు వేసిందా అని చర్చించుకుంటున్నారు. అయితే ఆదినారాయణ వర్గీయులు ఇప్పటికీ టీడీపీ నుంచి తమకు సరైన స్పందనే వస్తుందని ఎదురు చూస్తున్నారు. అయినా ఆదినారాయణరెడ్డి ఇలా చిక్కుకున్నారేంటో!

Tags:    
Advertisement

Similar News