అయ్యో పాపం... బట్టలకొట్టులో పనిచేశావా శ్రీమంతుడా?!
గల్లా ఫ్యామిలీ మొదటి నుంచి కూడా బాగా రిచ్. గల్లా అరుణ కుమారుడు గల్లా జయదేవ్ ఆ కుటుంబంలో గోల్డెన్ స్పూన్‌తో పుట్టారు. కానీ గల్లా జయదేవ్ మాత్రం తను కూడా కింది నుంచి వచ్చానంటున్నారు. నరసింహ సినిమాలో రజనీకాంత్ కష్టపడి ఎదిగిన తరహాలోనే తాను ఎదిగినట్టుగా ప్లాస్‌బ్యాక్ చెబుతున్నారు. విద్యార్థులతో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న గల్లా జయదేవ్.. అమెరికాలో తాను చదువుకునే రోజుల్లో సాగించిన జీవన పోరాటం వివరించారు. తాను అమెరికాలో పేపర్ బాయ్‌గా పనిచేశానని […]
గల్లా ఫ్యామిలీ మొదటి నుంచి కూడా బాగా రిచ్. గల్లా అరుణ కుమారుడు గల్లా జయదేవ్ ఆ కుటుంబంలో గోల్డెన్ స్పూన్‌తో పుట్టారు. కానీ గల్లా జయదేవ్ మాత్రం తను కూడా కింది నుంచి వచ్చానంటున్నారు. నరసింహ సినిమాలో రజనీకాంత్ కష్టపడి ఎదిగిన తరహాలోనే తాను ఎదిగినట్టుగా ప్లాస్‌బ్యాక్ చెబుతున్నారు. విద్యార్థులతో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న గల్లా జయదేవ్.. అమెరికాలో తాను చదువుకునే రోజుల్లో సాగించిన జీవన పోరాటం వివరించారు. తాను అమెరికాలో పేపర్ బాయ్‌గా పనిచేశానని చెప్పారు. అంతేకాదు బట్టలకొట్టులో పనిచేశారట. చదువుకు పేదరికం ఎప్పుడూ అడ్డురాదంటూ తన జీవితాన్ని ఉదాహరణగా చెప్పారు. జయదేవ్ చెప్పిన విషయాలు విని విద్యార్థులే కాదు పక్కనే ఉన్న నేతలు కూడా షాక్ అయ్యారు. వేల కోట్ల విలువైన సంస్థలున్న కుటుంబంలో పుట్టి అమెరికాలో చదువుకునేందుకు వెళ్లి పేపర్ బాయ్‌గా, బట్టలకొట్టులో పనిచేశారా అని ఆశ్చర్యపోయారు. అంటే అమెరికాకు వెళ్లి చదువుకున్న గల్లాజయదేవ్ కూడా పేదవాడేనన్నమాట. ఆయన పేదరికాన్ని జయించిన జయదేవ్ అన్న మాట.
Click to Read: