మీకు ఎంత ధైర్యం, తేలుస్తా...మీ సంగతి కూడా తేలుస్తా!- ఆగ్రహించిన బాబు
సీఎం చంద్రబాబుకు కోపమొచ్చింది. అది కూడా జర్నలిస్టులపై. ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గం రాయవరంలో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో జర్నలిస్టులు ప్లకార్డులు ప్రదర్శించారు. జర్నలిస్టులకు హెల్త్‌కార్డులు, ప్రమాద బీమా వర్తింప చేయాలంటూ ప్లకార్డులు పట్టుకున్నారు. వాటిని చూసిన చంద్రబాబుకు కోపం వచ్చింది. ”ప్లకార్డులు పట్టుకుంటే భయపడిపోతానా?. ఏమనుకుంటున్నారు? ఎంత ధైర్యం మీకు?”. అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ యూనియన్ సంగతి కూడా తేలుస్తానని హెచ్చరించారు. జర్నలిస్ట్ యూనియన్ వైసీపీ నేతల ఆధీనంలో ఉందని… మీకు సంబంధించిన ఏ కార్యక్రమానికి రానని చంద్రబాబు హెచ్చరించారు. న్యాయబద్ధమైన సమస్య […]
సీఎం చంద్రబాబుకు కోపమొచ్చింది. అది కూడా జర్నలిస్టులపై. ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గం రాయవరంలో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో జర్నలిస్టులు ప్లకార్డులు ప్రదర్శించారు. జర్నలిస్టులకు హెల్త్‌కార్డులు, ప్రమాద బీమా వర్తింప చేయాలంటూ ప్లకార్డులు పట్టుకున్నారు. వాటిని చూసిన చంద్రబాబుకు కోపం వచ్చింది. ”ప్లకార్డులు పట్టుకుంటే భయపడిపోతానా?. ఏమనుకుంటున్నారు? ఎంత ధైర్యం మీకు?”. అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ యూనియన్ సంగతి కూడా తేలుస్తానని హెచ్చరించారు.
జర్నలిస్ట్ యూనియన్ వైసీపీ నేతల ఆధీనంలో ఉందని… మీకు సంబంధించిన ఏ కార్యక్రమానికి రానని చంద్రబాబు హెచ్చరించారు. న్యాయబద్ధమైన సమస్య అయితే వచ్చి వినతిపత్రం ఇవ్వాలన్నారు. పది మందిని తెచ్చి అల్లరి చేస్తే కఠిన చర్యలుంటాయని జర్నలిస్టులను హెచ్చరించారు సీఎం. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే జర్నలిస్టులందరికీ ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో హెల్త్‌కార్డులు ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. 2014 ఆగస్టు చివరి నాటికే జర్నలిస్టులకు హెల్త్‌కార్డుల పంపిణీ పూర్తి చేస్తామని వైద్యాఆరోగ్యశాఖ మంత్రి కామినేని, సమాచారశాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి ఇద్దరూ అప్పట్లో ప్రకటించారు. అయితే అది కార్యరూపం దాల్చలేదు.
Click to Read: