మా జాతి అంతానికి మీ జాతి ఆరాటమా? తిరగబడితే పుట్టగతులుండవ్!
కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం సీఎం చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాపులు తిరగబడితే పుట్టగతులుండవని హెచ్చరించారు. ప్రభుత్వం కాపు గర్జన సభకు అటంకాలు సృష్టిస్తోందని ఆరోపించారు. ఈమేరకు చంద్రబాబుకు లేఖ రాశారు ముద్రగడ. ఎన్ని అడ్డంకులు సృష్టించినా కాపు గర్జన సభ విజయవంతం చేసి తీరుతామన్నారు. ఒక దినపత్రికలో తనకు వ్యతిరేకంగా చంద్రబాబు వార్తలు రాయిస్తున్నారని ముద్రగడ ఆరోపించారు. చంద్రబాబుకు దమ్ముంటే నేరుగా వార్తలు రాయించాలని సవాల్ చేశారు. తమరి పాలనతో కుల సమావేశం కాపులు తప్పా ఎవరైనా పెట్టుకోవచ్చా అని ప్రశ్నించారు. చంద్రబాబు సొంత సామాజికవర్గం పదేపదే […]
కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం సీఎం చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాపులు తిరగబడితే పుట్టగతులుండవని హెచ్చరించారు. ప్రభుత్వం కాపు గర్జన సభకు అటంకాలు సృష్టిస్తోందని ఆరోపించారు. ఈమేరకు చంద్రబాబుకు లేఖ రాశారు ముద్రగడ. ఎన్ని అడ్డంకులు సృష్టించినా కాపు గర్జన సభ విజయవంతం చేసి తీరుతామన్నారు. ఒక దినపత్రికలో తనకు వ్యతిరేకంగా చంద్రబాబు వార్తలు రాయిస్తున్నారని ముద్రగడ ఆరోపించారు. చంద్రబాబుకు దమ్ముంటే నేరుగా వార్తలు రాయించాలని సవాల్ చేశారు. తమరి పాలనతో కుల సమావేశం కాపులు తప్పా ఎవరైనా పెట్టుకోవచ్చా అని ప్రశ్నించారు. చంద్రబాబు సొంత సామాజికవర్గం పదేపదే కుల సమావేశాలు పెడుతుంటే అక్కడెందుకు అభ్యంతరం చెప్పడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కాపులు తాలిబన్ టెర్రరిస్లుల్లాంటి వారా అని నిలదీశారు. ”మా జాతి అంతిరించిపోవాలని మీ జాతిలో కొందరు పెద్దల ఆరాటమా?” అని ఘాటుగా స్పందించారు. ”మీ జాతి వారు మీ సహకారంతో విదేశాల్లో కులసభలు నిర్వహించడం లేదా” అని లేఖలో నిలదీశారు ముద్రగడ.
కోరిక తీరిన తర్వాత వామనమూర్తి బలిచక్రవర్తిని అభినందిస్తూ పాతాళానికి తొక్కినట్లుగా కాపు జాతి ఓట్లతో నెగ్గి, వారిని మీ పాదాలతోనే పాతానికి తొక్కివేయాలనే ఆలోచన మహాపాపం అన్నారు ముద్రగడ. చరిత్రలో ఎన్నో కాపు సభలు నిర్వహించామని ఇప్పుడు మాత్రం సభకు ఎందుకు అడ్డుపడుతున్నారని ముద్రగడ తీవ్రంగా ప్రశ్నించారు. కాపు జాతిని ముందే యుద్ధానికి ఆహ్వానిస్తున్నారా, కయ్యానికి కాలు దువ్వుతున్నారా అని లేఖలో చంద్రబాబును నిలదీశారు. 1910 నుంచి 1956 వరకు, 1961 నుంచి 1966 వరకు తమ కాపు జాతి అనుభవించిన బీసీ రిజర్వేషన్లు వెంటనే పునరుద్ధరించాలి ముద్రగడ డిమాండ్ చేశారు.