పవన్‌కు సామాజిక పరీక్ష

రిజర్వేషన్లతో పాటు పలు డిమాండ్ల సాధన కోసం ఉద్యమించేందుకు కాపులు చాపకింద నీరులా గుంపుకడుతున్నారు. అప్పుడే జిల్లాల్లో సమీకరణ సమావేశాలు కూడా ప్రారంభించారు. కాపు ఉద్యమంపై వివిధ పార్టీల్లోని కాపు నాయకులు స్పందించకతప్పని పరిస్థితిని సృష్టిస్తున్నారు. అయితే ప్రతి కాపు నేత కూడా ఉద్యమానికి మద్దతు పలుకుతున్నారు. బొత్సలాంటి వారు పెద్దన్నగా సాయపడుతానని చెబుతున్నారు. ఇప్పుడు అందరి దృష్టి పవన్‌ మీద పడుతోంది. పవన్ కల్యాణ్ కాపు సామాజికవర్గానికి చెందిన వ్యక్తి. కాపుల బలం చూసే ఎన్నికల […]

Advertisement
Update:2016-01-04 17:13 IST

రిజర్వేషన్లతో పాటు పలు డిమాండ్ల సాధన కోసం ఉద్యమించేందుకు కాపులు చాపకింద నీరులా గుంపుకడుతున్నారు. అప్పుడే జిల్లాల్లో సమీకరణ సమావేశాలు కూడా ప్రారంభించారు. కాపు ఉద్యమంపై వివిధ పార్టీల్లోని కాపు నాయకులు స్పందించకతప్పని పరిస్థితిని సృష్టిస్తున్నారు. అయితే ప్రతి కాపు నేత కూడా ఉద్యమానికి మద్దతు పలుకుతున్నారు. బొత్సలాంటి వారు పెద్దన్నగా సాయపడుతానని చెబుతున్నారు. ఇప్పుడు అందరి దృష్టి పవన్‌ మీద పడుతోంది.

పవన్ కల్యాణ్ కాపు సామాజికవర్గానికి చెందిన వ్యక్తి. కాపుల బలం చూసే ఎన్నికల ముందు చంద్రబాబు నేరుగా పవన్ ఇంటికి వెళ్లి మద్దతు కోరారు. అనుకున్నట్టుగానే పవన్ మద్దతు తెలపడంతో కాపుల్లో మేజారిటీ ఓటర్లు చంద్రబాబుకు పట్టం కట్టారు. పవన్ పరోక్ష పిలుపుతోనే ఒకేతాటిపైకి వచ్చి ఓట్లేసిన కాపులు ఇప్పుడు సొంత డిమాండ్ల కోసం పోరుబాట పడుతున్నారు. మరిప్పుడు పవన్ ఎలా స్పందిస్తారు అన్నది ఆసక్తికరంగా ఉంది. అయితే పవన్‌కు అందరు కాపు నేతల్లా బహిరంగంగా మద్దతు తెలిపే అవకాశం లేదు. ఎందుకంటే …

ఇప్పటికే జనసేన పార్టీని స్థాపించిన ఆయన భవిష్యత్తు రాజకీయాలను శాసించాలనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సొంత సామాజికవర్గం అన్న అభిమానంతో బహిరంగంగా కాపు ఉద్యమానికి మద్దతు పలికితే ప్రత్యర్థులు దాన్ని అవకాశంగా తీసుకునే అవకాశం ఉంది. గతంలో చిరంజీవి కూడా కొద్దిగా కాపుల వైపు మొగ్గుచూపగానే ప్రజారాజ్యం ఒక కులం పార్టీ అంటూ ముద్రవేసి దెబ్బతీశారు ప్రత్యర్థులు. ఇప్పుడు పవన్ కూడా కాపులకు మద్దతు తెలిపితే ఆయన కూడా చిరులాగే దెబ్బతినే అవకాశం ఉంటుంది. పవన్ కూడా ఒక కులం వైపు మొగ్గుచూపుతున్నారంటూ మిగిలిన పార్టీలు తమకున్న మీడియా పలుకుబడితో ప్రచారం చేయిస్తారు. అలాని కాపు ఉద్యమానికి పవన్ మద్దతు తెలపకపోయినా ఇబ్బందే. ఆపదకాలంలో అండగా నిలువలేదన్న అభిప్రాయం పవన్‌పై కాపులకు వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ రహస్యంగా మద్దతు తెలిపినా ఆ విషయం బయటకు పొక్కకుండా ఉంటుందా?. మొత్తం మీద పవన్‌కు కాపు ఉద్యమం ఒక పరీక్షలాంటిదే. పవన్‌ పరిస్థితిని కాపులు అర్థం చేసుకుని సహకరిస్తే మాత్రం తమ్ముడికి ఇబ్బంది ఉండకపోచ్చు.

Tags:    
Advertisement

Similar News