ఔటర్ రింగ్‌లో సొంత సామాజికవర్గం

పట్టువిడవకుండా రాజధాని కోసం భూసమీకరణ పూర్తి చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు రాజధాని ఔటర్ రింగ్‌ రోడ్డుపై ఫోకస్ పెట్టింది. రింగ్ రోడ్డు కోసం ఎనిమిది వేల ఎకరాలు తీసుకోవాలని నిర్ణయించారు. ఈ రింగ్ రోడ్డుపంటపొలాలతో పాటు కొన్ని గ్రామాలను చీల్చుకుంటూ వెళ్లనుంది. అందులోనూ 8లైన్ల రోడ్డు కావడంతో కొన్ని గ్రామాలు దాదాపు కనుమరుగు అవుతున్నాయి. దీంతో సదరు గ్రామాల వారు, రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇక్కడ మరో విషయం ఏమిటంటే ఈ రింగ్‌ రోడ్డు దారిలోని గ్రామాల్లో […]

Advertisement
Update:2016-01-04 06:23 IST

పట్టువిడవకుండా రాజధాని కోసం భూసమీకరణ పూర్తి చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు రాజధాని ఔటర్ రింగ్‌ రోడ్డుపై ఫోకస్ పెట్టింది. రింగ్ రోడ్డు కోసం ఎనిమిది వేల ఎకరాలు తీసుకోవాలని నిర్ణయించారు. ఈ రింగ్ రోడ్డుపంటపొలాలతో పాటు కొన్ని గ్రామాలను చీల్చుకుంటూ వెళ్లనుంది. అందులోనూ 8లైన్ల రోడ్డు కావడంతో కొన్ని గ్రామాలు దాదాపు కనుమరుగు అవుతున్నాయి. దీంతో సదరు గ్రామాల వారు, రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇక్కడ మరో విషయం ఏమిటంటే ఈ రింగ్‌ రోడ్డు దారిలోని గ్రామాల్లో టీడీపీకి అండగా ఉంటున్న ఒక సామాజికవర్గం వారే అధికంగా ఉన్నారు. వారంతా ఇప్పుడు ప్రభుత్వ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

కష్టపడి టీడీపీని అధికారంలోకి తెస్తే ఇప్పుడు తమపైనే రింగ్ రోడ్డు వేస్తున్నారని ఆవేదన చెందుతున్నారు. కొందరు రియల్టర్ల లబ్ధి కోసమే రింగ్‌ రోడ్డు ప్లాన్ తయారు చేశారని ఆరోపిస్తున్నారు. తమకు మేలు చేయకపోయినా పర్వాలేదు… ఈ రింగ్‌ నుంచి బయటపడేయండి కోరుతున్నారు. అయితే అధికారులు మాత్రం పరిస్థితిని అర్థం చేసుకోవాలని కోరుతున్నారు. రింగ్‌ రోడ్డును ఇష్టానుసారం మళ్లించడం సాధ్యం కాదని చెబుతున్నారు. ఎవరినో టార్గెట్ చేస్తూ రింగ్ రోడ్డు వేయడం లేదంటున్నారు. ప్రభుత్వ నిర్ణయంపై కొందరు కోర్టుకు వెళ్లేందుకు కూడా సిద్ధమవుతున్నారు. రింగ్ రోడ్డు కృష్ణా, గుంటూరు జిల్లాలను కలుపుతూ వెళ్తుంది. మెగులూరు, ఆత్మకూరు, పరిటాల, కొండూరు, మైలవరం, హనుమాన్ జంక్షన్, పామర్రు, పెద్దకాకాని, కొల్లూరు, తెనాలి, పెద్దకాకాని, గుంటూరు, సత్తనపల్లి మీదుగా రోడ్డు వెళ్లనుంది.

Tags:    
Advertisement

Similar News