టీడీపీకి హ్యాండిస్తున్న రాజులు
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఏ ఓటు బ్యాంకునైతే చూసుకుని టీడీపీ ధైర్యంగా ఉందో అదే ఓటు బ్యాంకుపై టీఆర్ఎస్ కన్నేసింది. బెదిరించి కాకుండా అభయమిచ్చి సదరు వర్గాలను తన వైపు తిప్పుకుంటోంది. తాజాగా హైదరాబాద్‌లోని రాజులను ఆకర్శించే పనిలో మంత్రి కేటీఆర్ నిమగ్నమై ఉన్నారు. ఇందులో భాగంగా ఆయన రాజు సామాజికవర్గీయులతో సమావేశం నిర్వహించారు. ఇటీవల బోయినపల్లి, కూకట్ పల్లిలో అంతర్గత సమావేశాలకు కేటీఆర్, కృష్ణారావులు హాజరయ్యారు. టీఆర్‌ఎస్‌కు మద్దతివ్వాల్సిందిగా వారిని కేటీఆర్ కోరినట్టు తెలుస్తోంది. టీఆర్ఎస్‌ను గెలిపిస్తే […]
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఏ ఓటు బ్యాంకునైతే చూసుకుని టీడీపీ ధైర్యంగా ఉందో అదే ఓటు బ్యాంకుపై టీఆర్ఎస్ కన్నేసింది. బెదిరించి కాకుండా అభయమిచ్చి సదరు వర్గాలను తన వైపు తిప్పుకుంటోంది. తాజాగా హైదరాబాద్‌లోని రాజులను ఆకర్శించే పనిలో మంత్రి కేటీఆర్ నిమగ్నమై ఉన్నారు. ఇందులో భాగంగా ఆయన రాజు సామాజికవర్గీయులతో సమావేశం నిర్వహించారు. ఇటీవల బోయినపల్లి, కూకట్ పల్లిలో అంతర్గత సమావేశాలకు కేటీఆర్, కృష్ణారావులు హాజరయ్యారు. టీఆర్‌ఎస్‌కు మద్దతివ్వాల్సిందిగా వారిని కేటీఆర్ కోరినట్టు తెలుస్తోంది. టీఆర్ఎస్‌ను గెలిపిస్తే ఎలాంటి సమస్య వచ్చినా అండగా ఉంటాయని కేటీఆర్ హామీ ఇచ్చారట. కావాలంటే సీమాంధ్రలో మీకు ఇష్టమైన పార్టీకి ఓటేసుకోవచ్చని హైదరాబాద్ మాత్రం టీఆర్ఎస్‌కు మద్దతు పలికి అభివృద్ధికి సహకరించాలని కోరారని చెబుతున్నారు.
కేటీఆర్ విజ్ఞప్తికి రాజులు కూడా అంగీకరించారని చెబుతున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కే తమ సామాజికవర్గం వారు ఓటేసేలా చూస్తామని రాజునాయకులు హామీ ఇచ్చారని తెలుస్తోంది. ఈ పరిణామం టీడీపీకి ఆందోళన చెందుతున్నారు. సీమాంధ్ర పార్టీ టీడీపీ కాబట్టి వారి ఓట్లన్నీ పడుతాయని అంచనా వేశారు. అయితే కేటీఆర్ రాజులను దువ్వేస్తుండడంతో గ్రేటర్ తమ్ముళ్లు కలవరపడుతున్నారు. లోకేష్ తమ పార్టీ తరపున పూర్తి స్థాయిలో రంగంలోకి దిగుతారని వారు భావించారు. కానీ అది కూడా జరక్కపోవడంతో అసలు గ్రేటర్ టీడీపీని ఎవరూ ఎన్నికల్లో నడిస్తారన్న దానిపైనా వారికి స్పష్టత రావడం లేదు. మొత్తం మీద గ్రేటర్లో ప్రచార ధోరణి చూస్తుంటే అందరికంటే కేటీఆర్ చాలా ముందున్నట్టుగా అనిపిస్తోంది.
Click to Read: