అదే ప్రచారం- అప్పుడు కొడాలి, ఇప్పుడు రోజా
మీడియా మేనేజ్‌మెంట్‌లో టీడీపీని మించిన పార్టీ లేదంటుంటారు. మీడియాను మేనేజ్ చేయడమే కాదు ఎదుటివారిపై సైకలాజికల్‌గా అటాక్ చేయడంలోనూ టీడీపీని మించిన పార్టీ ఉండదనిపిస్తుంది. తొలుత నేరుగా అటాక్ చేయడం ఆ ఎత్తు ఫలించకపోతే రెండో దఫాలో రివర్స్‌లో వారే లొంగిపోతున్నారంటూ ప్రచారం చేయడం. ఈ ఎత్తును టీడీపీ పదేపదే ప్రయోగించడానికి కారణం వైసీపీ అసమర్ధత కూడా ఒక కారణంగానే చెప్పుకుంటున్నారు. మొన్నీ మధ్య గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నానిపై ఈ ఎత్తునే టీడీపీ నేతలు ప్రయోగించారు . […]
మీడియా మేనేజ్‌మెంట్‌లో టీడీపీని మించిన పార్టీ లేదంటుంటారు. మీడియాను మేనేజ్ చేయడమే కాదు ఎదుటివారిపై సైకలాజికల్‌గా అటాక్ చేయడంలోనూ టీడీపీని మించిన పార్టీ ఉండదనిపిస్తుంది. తొలుత నేరుగా అటాక్ చేయడం ఆ ఎత్తు ఫలించకపోతే రెండో దఫాలో రివర్స్‌లో వారే లొంగిపోతున్నారంటూ ప్రచారం చేయడం. ఈ ఎత్తును టీడీపీ పదేపదే ప్రయోగించడానికి కారణం వైసీపీ అసమర్ధత కూడా ఒక కారణంగానే చెప్పుకుంటున్నారు.
మొన్నీ మధ్య గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నానిపై ఈ ఎత్తునే టీడీపీ నేతలు ప్రయోగించారు . గుడివాడలో కొరకరానికొయ్యగా మారిన నానిని లొంగదీసుకునేందుకు పోలీసులను మోహరించి ఆయన కార్యాలయాన్ని ఖాళీ చేయించారు. అయినా ఆయన లొంగకపోవడంతో తమ అనుకూల మీడియా ద్వారా కొత్త ప్రచారం చేయించారు. ప్రభుత్వ ఒత్తిడికి నాని తట్టుకోలేకపోతున్నారని… టీడీపీని ఆశ్రయించేందుకు సిద్ధపడ్డారంటూ ఓ పద్దతి ప్రకారం ప్రచారం చేయించారు. అయితే ఇంతలోనే అసెంబ్లీ సమావేశాలు మొదలడం, స్పీకర్ పోడియం దగ్గరకు వెళ్లి ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి అచ్చెన్నాయుడులను నాని బూతులు తిట్టడంతో కథ అడ్డం తిరిగింది. సీఎంను తీవ్ర స్థాయిలో తిట్టేసరికి నాని టీడీపీలోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నారన్న ప్రచారం హఠాత్తుగా ఆగిపోయింది. ఇప్పుడు టార్గెట్ రోజా.
అసెంబ్లీ నుంచి ఏడాది సస్పెండ్ చేయడంతో ఆమెపై సానుభూతి వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో రోజాపై ఇప్పుడు టీడీపీ నేతలు కొత్త ప్రచారానికి తెరలేపారు. రోజా టీడీపీలో చేరే ప్రయత్నంలో ఉన్నారని… ఆమెను సినిమాల్లోకి తీసుకొచ్చిన చిత్తూరు జిల్లా నేత శివప్రసాదే ఇందుకు మధ్యవర్తిత్వం వహిస్తున్నారంటూ ఫీలర్ వదిలారు. తనను ఏడాది పాటు సస్పెండ్ చేస్తే వైసీపీ నాయకత్వం సరిగా స్పందించలేదని… తనను ఉపయోగించుకోకుంటే వైసీపీకే నష్టం అని ఆమె అన్నట్టుగా కథనాలు రాశారు. ఇలా చేయడం ద్వారా రోజాపై వైసీపీలో అనుమానాలు రేగుతాయి, ఆ అనుమానాలు నమ్మి వైసీపీ నాయకత్వం రోజాను కాస్త దూరంగా ఉంచుతుంది. దానితో ఆమె మనస్తాపం చెంది పార్టీ మారేందుకు సిద్ధమవుతారు. ఇదీ టీడీపీ వ్యూహం. వైసీపీ వ్యూహాలు మాత్రం అందుకు పూర్తి భిన్నం. గుడ్డిఎద్దు చేలో పడ్డట్టుగా అలా సాగిపోతుంటాయి.