బాబు కోసం- ఆరుగురు ఐఏఎస్‌ల సాహస యాత్ర
ఆంధ్రప్రదేశ్ ఐఏఎస్‌ల బస్సు యాత్ర ఇప్పుడు చర్చనీయాంశమైంది. బస్సు యాత్ర అంటే ప్రజలను చైతన్యం చేయడానికో, రాష్ట్ర్రంలో ప్రజల స్థితిగతులు తెలుసుకునేందుకో కాదు. చంద్రబాబును కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలపడానికి. ఇందుకోసం ఐఏఎస్ అధికారులు ఏకంగా హైదరాబాద్ నుంచి విజయవాడకు బస్సులో బయలుదేరారు. అది కూడా ప్రత్యేక గరుడా బస్సులో. బస్సును సచివాలయానికి రప్పించుకుని అక్కడి నుంచే బయలు దేరారు. అయితే ఇక్కడ మరో ట్విస్ట్ ఉంది. చంద్రబాబును కలిసేందుకు అనగానే అధికారులతో బస్సు నిండిపోతుందనుకున్నారు. కానీ […]
ఆంధ్రప్రదేశ్ ఐఏఎస్‌ల బస్సు యాత్ర ఇప్పుడు చర్చనీయాంశమైంది. బస్సు యాత్ర అంటే ప్రజలను చైతన్యం చేయడానికో, రాష్ట్ర్రంలో ప్రజల స్థితిగతులు తెలుసుకునేందుకో కాదు. చంద్రబాబును కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలపడానికి. ఇందుకోసం ఐఏఎస్ అధికారులు ఏకంగా హైదరాబాద్ నుంచి విజయవాడకు బస్సులో బయలుదేరారు. అది కూడా ప్రత్యేక గరుడా బస్సులో. బస్సును సచివాలయానికి రప్పించుకుని అక్కడి నుంచే బయలు దేరారు. అయితే ఇక్కడ మరో ట్విస్ట్ ఉంది.
చంద్రబాబును కలిసేందుకు అనగానే అధికారులతో బస్సు నిండిపోతుందనుకున్నారు. కానీ చివరకు బస్సు ఎక్కింది కేవలం ఆరుగురు ఐఏఎస్‌లు మాత్రమే. ఎల్వీ సుబ్రమణ్యం,లింగరాజ్ పాణి, సిసోడియా, అశోక్, జేపీ శర్మ బస్సులో అక్కడొకరు ఇక్కడొకరు కూర్చుని బయలుదేరారు. ఇలా ఆరుగురే బస్సులో పోతే బాగుండదనుకున్న సీనియర్ ఐఏఎస్‌లు ఇతర అధికారులకు ఆహ్వానం పలికారు. ఉద్యోగసంఘాల నేతలను సంప్రదించారు. కానీ కేవలం చంద్రబాబుకు విసెష్ చెప్పడం కోసం హైదరాబాద్ నుంచి విజయవాడకు బస్సులో వెళ్లే ఆలోచన తెలియగానే వెనక్కు తగ్గారు.
అయితే ఇక్కడే మరో ట్విస్ట్ ఏమిటంటే. బస్సులో వెళ్లిన ఆరుగురు ఐఏఎస్‌లు ఒకరకంగా అమాయకులే. ఎందుకంటే వీరు బస్సులో వెళ్తే మిగిలిన సీనియర్ ఐఏఎస్‌లు తామేంది బస్సులో వెళ్లేది ఏమిటంటూ విమానాలెక్కి విజయవాడలో వాలిపోయారు. వారంతా అలా విమానాల్లో వెళ్లే సరికి ఈ ఆరుగురు ఐఏఎస్‌లు మాత్రం ఇలా బస్సులో బయలుదేరి వెళ్లారు. అయితే హైదరాబాద్‌లోని ఐఏఎస్‌లను చంద్రబాబు పేషీ అధికారులే ఫోన్ చేసి మరీ పిలిపించారని కూడా చెబుతున్నారు.