అభిమానం ఉరిమి జగన్ మీద పడ్డారు
రాష్ట్రంలో చాలా సమస్యలకు జగనే కారణమంటూ టీడీపీ నేతలు పదేపదే విమర్శిస్తుంటారు. పరిష్కారం సాధ్యంకానీ సమస్యలకు కారణం పక్క పార్టీ నాయకులే అనడం రాజకీయాల్లో కొత్తమీ కాదు. అయితే ఈ కేటగిరిలో బాలకృష్ణ అభిమానులు కూడా చేరిపోయారు. వారి టార్గెట్ కూడా జగనే. నందమూరి హీరోలు బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్ మధ్య గ్యాప్ పెరగడానికి కారణం జగనేనంటూ బాలయ్య యూత్ రగిలిపోతోంది. సోషల్ మీడియాలో జగన్‌పై ఓ రేంజ్‌లో చెలరేగిపోతున్నారు. ఆగ్రహాన్ని ఆవేదనను తెలియజేసేందుకు కొందరు అభిమానులు […]
రాష్ట్రంలో చాలా సమస్యలకు జగనే కారణమంటూ టీడీపీ నేతలు పదేపదే విమర్శిస్తుంటారు. పరిష్కారం సాధ్యంకానీ సమస్యలకు కారణం పక్క పార్టీ నాయకులే అనడం రాజకీయాల్లో కొత్తమీ కాదు. అయితే ఈ కేటగిరిలో బాలకృష్ణ అభిమానులు కూడా చేరిపోయారు. వారి టార్గెట్ కూడా జగనే. నందమూరి హీరోలు బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్ మధ్య గ్యాప్ పెరగడానికి కారణం జగనేనంటూ బాలయ్య యూత్ రగిలిపోతోంది. సోషల్ మీడియాలో జగన్‌పై ఓ రేంజ్‌లో చెలరేగిపోతున్నారు. ఆగ్రహాన్ని ఆవేదనను తెలియజేసేందుకు కొందరు అభిమానులు కవులుగా మారి పద్యాలు కూడా రచించేశారు.
నందమూరి నటసింహం బాలకృష్ణ, యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాలు రెండూ ఇప్పుడు సంక్రాంతి బరిలో పోటీకి దిగుతుండడంతో మరోసారి నందమూరి ఫ్యాన్స్ మనసు చలించిపోతోంది. నందమూరి నటులు పరస్పరం పోటీ పడడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. బాబాయ్ సినిమాకు ఎన్టీఆర్ కావాలనే అడ్డువస్తున్నారన్నది బాలయ్య ఫ్యాన్స్ ఆరోపణ. పనిలో పనిగా ఈ సినిమాల పోరును జగన్‌పైకి మళ్లించారు. ఎన్టీఆర్‌ను వెనుకుండి జగనే ప్రోత్సహిస్తున్నారని కొత్త అనుమానాన్ని సోషల్ మీడియాలోకి వదిలారు. అందులో ఎంత నిజం ఉందోగాని బాలయ్య ఫ్యాన్స్ మాత్రం అయి ఉండవచ్చు అంటూ వారు కూడా జగన్‌పై నాలుగు మాటలు విసురుతున్నారు. ఇటీవల చిలకలూరిపేటలో జరిగిన ఒక వివాహంలో జగన్, హరికృష్ణ కలిసి పాల్గొనడం ఏకాంతంగా చర్చలు వంటి విషయాలను గుర్తు చేసుకుంటున్నారు.
హరికృష్ణ, జగన్ మధ్య వారధిగా కొడాలి నాని ఉన్నారంటూ లాజిక్ చెబుతున్నారు. నాన్నకు ప్రేమతో ఆడియో ఫంక్షన్‌లో కనీసం బాలయ్య పేరును హరికృష్ణ ప్రస్తావించకపోవడాన్ని కూడా బాలకృష్ణ ఫ్యాన్స్ తట్టుకోలేకపోతున్నారు. ఈ స్థాయిలో హరికృష్ణ, బాలకృష్ణ మధ్య అగాధం సృష్టించడంలోనూ జగన్ ప్రమేయం ఉందని టీడీపీ, బాలయ్య అభిమానులు సోషల్ మీడియాలో ప్రచారం మొదలుపెట్టారు. అదన్న మాట ఎన్టీఆర్, బాలయ్య మధ్య గ్యాప్ పెరగడానికి అసలు కారణాలు ఏమున్నాయో గానీ…బాలయ్య ప్యాన్స్ మాత్రం జగన్‌పై అనుమానపు చూపు చూస్తున్నారు. టీడీపీ, నందమూరి అభిమానులను జూనియర్ ఎన్టీఆర్‌కు దూరం చేసే ఎత్తుగడలో భాగంగానే కొందరు ఈ ప్రచారం మొదలుపెట్టారన్న అనుమానాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ బలపడితే భవిష్యత్తులో లోకేష్‌కు పోటీగా తయారవుతారన్న భావనతోనే ఈ ప్రచారం చేస్తున్నారా అన్న సందేహం కొందరు నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు.
Click below to Read