పరువు నిలుపుకున్న బడా రెడ్లు

నల్లగొండ జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి విజయకేతనం ఎగురవేశారు. ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో చివరకు రాజగోపాల్‌ రెడ్డి గెలుపు సాధించారు. టీఆర్‌ఎస్ అభ్యర్థి తేరా చిన్నపరెడ్డిపై 193 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఎన్నికల్లో మొత్తం 1100 ఓట్లు పోలవగా రాజగోపాల్‌ రెడ్డికి 642 ఓట్లు రాగా… టీఆర్‌ఎస్‌ అభ్యర్థికి 449 ఓట్లు వచ్చాయి. రాజగోపాల్ రెడ్డి గెలుపుతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు జరుపుకున్నాయి. తెలంగాణలో మొత్తం 12 స్థానాలకు ఎమ్మెల్సీ […]

Advertisement
Update:2015-12-30 05:06 IST

నల్లగొండ జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి విజయకేతనం ఎగురవేశారు. ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో చివరకు రాజగోపాల్‌ రెడ్డి గెలుపు సాధించారు. టీఆర్‌ఎస్ అభ్యర్థి తేరా చిన్నపరెడ్డిపై 193 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఎన్నికల్లో మొత్తం 1100 ఓట్లు పోలవగా రాజగోపాల్‌ రెడ్డికి 642 ఓట్లు రాగా… టీఆర్‌ఎస్‌ అభ్యర్థికి 449 ఓట్లు వచ్చాయి. రాజగోపాల్ రెడ్డి గెలుపుతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు జరుపుకున్నాయి. తెలంగాణలో మొత్తం 12 స్థానాలకు ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ రాగా… ఆరు స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగిలిన ఆరు స్థానాలకు పోలింగ్ జరిగింది. వీటిలో నల్లగొండ ఎమ్మెల్సీపైనే అందరి దృష్టి ఉండేది. click to read: ఖమ్మంలో వైసీపీ దెబ్బ?, టీఆర్‌ఎస్ గెలుపు…

కాంగ్రెస్‌కు నాయకత్వం వహిస్తున్న జానారెడ్డి, ఉత్తమకుమార్‌ రెడ్డి, గుత్తాసుఖేందర్ రెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్ ఈ జిల్లాకు చెందిన వారే కావడంతో ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారింది. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి ఓడిపోతే తమ రాజకీయ భవిష్యత్తుపైనా తీవ్ర ప్రభావం ఉంటుందన్న ఉద్దేశంతో జిల్లా అగ్రనేతలంతా విభేదాలు పక్కన పెట్టి రాజగోపాల్ రెడ్డి గెలుపు కోసం ప్రయత్నించారు. టీఆర్‌ఎస్ అభ్యర్థి తరపున మంత్రి జగదీష్ రెడ్డి సర్వశక్తులు ఒడ్డి పోరాడారు. అయితే చివరకు విజయం కాంగ్రెస్ అభ్యర్థినే వరించింది.

Tags:    
Advertisement

Similar News