కృష్ణాను మూసీ చేసే మాస్టర్‌ప్లాన్

అత్యుత్తమ హంగులతో రాజధాని నిర్మాణం కోసం మాస్టర్‌ప్లాన్ సిద్ధం చేసిన సింగపూర్‌ సంస్థలు కృష్ణమ్మ విషయంలో మాత్రం శ్రద్ధ చూపలేదు. సింగపూర్ సంస్థ ఇచ్చిన మాస్టర్‌ప్లాన్‌ ప్రకారమే ముందుకెళ్తే కృష్ణా నది మరో మూసి నదిగా మారుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుత మాస్టర్ ప్లాన్‌ ప్రకారం అమరావతిలోని పరిశ్రమలు, గృహాల నుంచి వచ్చే వ్యర్థాల కోసం రాజధాని ప్రాంతంలో ప్రత్యేకంగా వాటర్ పాండ్స్‌ నిర్మించనున్నారు. అనంతరం వాటర్ పాండ్స్‌ను నేరుగా కృష్ణానదితో లింక్ చేస్తారు. అంటే అంతిమంగా అమరావతి […]

Advertisement
Update:2015-12-29 06:48 IST

అత్యుత్తమ హంగులతో రాజధాని నిర్మాణం కోసం మాస్టర్‌ప్లాన్ సిద్ధం చేసిన సింగపూర్‌ సంస్థలు కృష్ణమ్మ విషయంలో మాత్రం శ్రద్ధ చూపలేదు. సింగపూర్ సంస్థ ఇచ్చిన మాస్టర్‌ప్లాన్‌ ప్రకారమే ముందుకెళ్తే కృష్ణా నది మరో మూసి నదిగా మారుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుత మాస్టర్ ప్లాన్‌ ప్రకారం అమరావతిలోని పరిశ్రమలు, గృహాల నుంచి వచ్చే వ్యర్థాల కోసం రాజధాని ప్రాంతంలో ప్రత్యేకంగా వాటర్ పాండ్స్‌ నిర్మించనున్నారు. అనంతరం వాటర్ పాండ్స్‌ను నేరుగా కృష్ణానదితో లింక్ చేస్తారు. అంటే అంతిమంగా అమరావతి మురికి నీరు, వ్యర్థాలు కృష్ణానదిలోకి చేరుతాయి.

వ్యర్థాలను నేరుగా కృష్ణా నదిలో వదలకుండా… నదికి సమాంతరంగా వ్యర్థ జలాలు వెళ్లేందుకు కాలువ డిజైన్ చేయాలని సిగపూర్‌ సంస్థను ఏపీ ప్రభుత్వ అధికారులు కోరారు. అయితే మాస్టర్‌ప్లాన్‌లో మాత్రం అలాంటి ఏర్పాటును సింగపూర్ సంస్థ ప్రతిపాదించలేదు. దీంతో ఇరిగేషన్, పర్యావరణ నిపుణులు ఆందోళన చెందుతున్నారు. అమరావతి వ్యర్థాలను మొత్తం కృష్ణానదిలోకి వదలడం వల్ల విజయవాడవాసులు అమరావతి మురికి నీరు తాగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంతేకాదు పంటపొలాలు కూడా దెబ్బతింటాయని ఆందోళన చెందుతున్నారు. కృష్ణా నది మరో మూసి నదిగా మారుతుందన్నారు. దాంతో చేపలు వంటి నదీప్రాణులు నశించిపోవడంతో పాటు మొత్తంగా పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుందని అంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నేరుగా నదిలోకి వ్యర్థ జలాలు వదలడం శ్రేయస్కరం కాదంటున్నారు. కృష్ణా నదిని అమరావతి కాలుష్యం నుంచి కాపాడేందుకు తప్పనిసరిగా నదికి పక్కనే సమాంతర కాలువ తవ్వాలని కోరుతున్నారు.

Tags:    
Advertisement

Similar News