కల్చరల్‌ సెంటర్‌పైనా కత్తికట్టారు

జీహెచ్‌ఎంసీ అధికారుల తీరు మరోసారి వివాదాస్పదమవుతోంది. కల్చరల్ సెంటర్‌పైనా అధికారులు కత్తికట్టారు. కల్చరల్ ఈవెంట్స్ జరిగే లామకాన్‌ను మూసివేయించేందుకు కంకణం కట్టుకుని పనిచేస్తున్నారు. బంజారాహిల్స్ రోడ్డు నెంబర్‌-5లోని లామకాన్‌ కల్చరల్ సెంటర్‌ను మూసివేయాలంటూ నోటీసులు జారీ చేశారు. అందుకు జీహెచ్‌ఎంసీ చెప్పిన కారణాలు ఆశ్చర్యకరంగా ఉన్నాయి. ట్రాఫిక్‌కు ఇబ్బంది అవుతోందంటూ ఏకంగా సెంటర్‌నే మూసివేయాలంటున్నారు. కల్చరల్ సెంటర్‌ వల్ల న్యూసెన్స్‌ అవుతోందట. తొలుత జీహెచ్‌ఎంసీ నోటీసులు జారీ చేసింది. ఇందుకు లామకాన్‌ నిర్వాహకులు సమాధానం ఇచ్చారు. అయితే […]

Advertisement
Update:2015-12-29 11:28 IST

జీహెచ్‌ఎంసీ అధికారుల తీరు మరోసారి వివాదాస్పదమవుతోంది. కల్చరల్ సెంటర్‌పైనా అధికారులు కత్తికట్టారు. కల్చరల్ ఈవెంట్స్ జరిగే లామకాన్‌ను మూసివేయించేందుకు కంకణం కట్టుకుని పనిచేస్తున్నారు. బంజారాహిల్స్ రోడ్డు నెంబర్‌-5లోని లామకాన్‌ కల్చరల్ సెంటర్‌ను మూసివేయాలంటూ నోటీసులు జారీ చేశారు. అందుకు జీహెచ్‌ఎంసీ చెప్పిన కారణాలు ఆశ్చర్యకరంగా ఉన్నాయి. ట్రాఫిక్‌కు ఇబ్బంది అవుతోందంటూ ఏకంగా సెంటర్‌నే మూసివేయాలంటున్నారు. కల్చరల్ సెంటర్‌ వల్ల న్యూసెన్స్‌ అవుతోందట. తొలుత జీహెచ్‌ఎంసీ నోటీసులు జారీ చేసింది. ఇందుకు లామకాన్‌ నిర్వాహకులు సమాధానం ఇచ్చారు. అయితే ఆ సమాధానం సంతృప్తికరంగా లేదంటూ ఇప్పుడు ఏకంగా సెంటర్‌ను మూసివేయాలంటూ నోటీసులు జారీ చేశారు.

పబ్లిక్‌ న్యూసెన్స్ అంటున్నారు కదా… ఇందుకు సంబంధించి ఎవరైనా ఫిర్యాదు చేశారా అని జీహెచ్‌ఎంసీ అధికారులను ప్రశ్నిస్తే తొలుత నీళ్లు నమిలారు. అనంతరం తామే సుమోటోగా ఈ అంశాన్ని తీసుకున్నామని చెబుతున్నారు. జీహెచ్‌ఎంసీ తీరుపై కళాకారులు, లామకాన్‌తో అనుబంధం ఉన్న వారు తీవ్రంగా తప్పుపడుతున్నారు. వెంటనే నోటీసులు వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వాలకు, మతసంస్థలకు నచ్చని అనేక సాహితీ, సాంస్రృతిక కార్యక్రమాలకు, ప్రభుత్వం మెచ్చని రాజకీయ సంస్థల సభలకు లామకాన్‌ వేదిక కావడం, ప్రభుత్యానికి , ప్రభుత్వం ద్వారా జీహెచ్‌ఎంసీకి ఇబ్బంది కలిగినట్టుంది అని కొందరు విమర్శిస్తున్నారు.

కల్చరల్ సెంటర్ వల్ల ట్రాఫిక్ ఇబ్బంది కలుగుతోందని చెబుతున్న జీహెచ్‌ఎంసీ అధికారులకు లామకాన్‌ను ఇష్టపడే వారు మరికొన్ని ప్రశ్నలు కూడా సంధిస్తున్నారు. హైదరాబాద్‌లో నారాయణ, చైతన్య వంటి కాలేజీలు మెయిన్‌ రోడ్డు మీదే ఉంటాయి. కాలేజ్‌ వదిలిన సమయంలో విద్యార్థులంతా ఒక్కసారిగా రోడ్డుపైకి వస్తుండడంతో ట్రాఫిక్ స్తంభించి పోతోంది. మరి అలాంటి కార్పొరేట్ కాలేజ్‌లపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. పైగా ప్రతివారం హైదరాబాద్‌లో హీరో, హీరోయిన్లు పలు షాపులకు ప్రారంభోత్సవం చేస్తుంటారు. ఆ సమయంలోనూ భారీగా ట్రాఫిక్ స్తంభించిపోతుంది. మరీ వాటిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని జీహెచ్‌ఎంసీ అధికారులను ప్రశ్నిస్తున్నారు. కార్పొరేట్‌ కాలేజ్‌లపై వందలకొద్ది ఫిర్యాదులు వచ్చినా పట్టించుకోని జీహెచ్‌ఎంసీ అధికారులు.. ఎవరి నుంచి ఎలాంటి అభ్యంతరాలు, ఫిర్యాదులు లేకపోయినా లామకాన్‌పై కత్తికట్టడం ఏమిటని పలువురు నిలదీస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News