కొణతాల జీవితంతో తమ్ముళ్ల కొత్త గేమ్స్

దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదు అన్నట్టుగా తయారైంది మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ పరిస్థితి. కొణతాల పార్టీలోకి చేర్చుకునేందుకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా లోకల్ లీడర్లు మాత్రం ఆయన్ను పార్టీ గేటు దగ్గరే ఆపేందుకు రచ్చ చేస్తున్నారు. తాజాగా విశాఖ జిల్లా అనకాపల్లి నియోజకవర్గ టీడీపీ నాయకులు ఆదివారం సమావేశం నిర్వహించారు. కొణతాలను పార్టీలోకి తీసుకొస్తే సహించే ప్రసక్తే లేదని తీర్మానం చేశారు. కాంగ్రెస్‌ హయాంలో టీడీపీ కార్యకర్తలు, నేతలపై కేసులు పెట్టించి వేధించిన వ్యక్తిని […]

Advertisement
Update:2015-12-28 06:39 IST

దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదు అన్నట్టుగా తయారైంది మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ పరిస్థితి. కొణతాల పార్టీలోకి చేర్చుకునేందుకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా లోకల్ లీడర్లు మాత్రం ఆయన్ను పార్టీ గేటు దగ్గరే ఆపేందుకు రచ్చ చేస్తున్నారు. తాజాగా విశాఖ జిల్లా అనకాపల్లి నియోజకవర్గ టీడీపీ నాయకులు ఆదివారం సమావేశం నిర్వహించారు. కొణతాలను పార్టీలోకి తీసుకొస్తే సహించే ప్రసక్తే లేదని తీర్మానం చేశారు. కాంగ్రెస్‌ హయాంలో టీడీపీ కార్యకర్తలు, నేతలపై కేసులు పెట్టించి వేధించిన వ్యక్తిని పార్టీలోకి ఎలా తెస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. కొణతాల పార్టీలోకి వచ్చిన మరుక్షణం తామంతా మూకుమ్మడిగా రాజీనామా చేసి పార్టీ నుంచి బయటకు వెళ్లిపోవాలని సమావేశంలో నేతలు ఏకగ్రీవంగా తీర్మానం చేసుకున్నారు. కొణతాల మంత్రిగా ఉన్నప్పుడు పెట్టిన కేసులపై ఇప్పటికీ టీడీపీ కార్యకర్తలు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని నేతలు గుర్తు చేశారు.

అయితే కొణతాలకు వ్యతిరేకంగా నేతలు గ్రూప్ కట్టడం వెనుక గంటా శ్రీనివాస్‌ హస్తముందని చెబుతున్నారు. మంత్రి అయన్నపాత్రుడు కొణతాలను పార్టీలోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తుండగా గంటా వర్గం వ్యతిరేకిస్తోంది. ఎన్నికల ముందు గంటా శ్రీనివాస్‌ రాకతో జిల్లాలో పార్టీ బలోపేతమైందని… ఇప్పుడు కొణతాల వస్తే జిల్లా పార్టీ రెండుగా చీలుతుందని సమావేశంలో లోకల్ లీడర్లు వ్యాఖ్యానించడం గమనార్హం. ఈ పరిస్థితిపై కొణతాల వర్గం ఆందోళన చెందుతోంది. తమ నేతను ఎటూ కాకుండా చేసేందుకు కుట్రలు చేయడం లేదు కదా అని వారు అనుమానిస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News