బెజ'వార్‌' " ఎవరిని నరుకుతావ్?, మరోసారి నష్టపోయేందుకూ రెడీ

బెజవాడలో మరోసారి పొలిటికల్ వార్ మొదలైంది. దేవినేని నెహ్రుపై వంగవీటి రాధా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వంగవీటి రంగా 27వ వర్థంతి సందర్భంగా విజయవాడలో నివాళులర్పించిన ఆయన  రాధా మీడియాతో మాట్లాడారు. దేవినేని నెహ్రుపై నేరుగా విరుచుకుపడ్డారు. చనిపోయిన తన తండ్రిపై 20 హత్య కేసులున్నాయంటూ దేవినేని నెహ్రు పిచ్చివాగుడు వాగుతున్నాడని అన్నారు. చనిపోయిన వారిపై ఆరోపణలు చేయడం హీరోయిజం అనుకుంటున్నావా అని ప్రశ్నించారు. Click to Read: ఆ బూతు ముందు… ఈ బూతు ఎంత […]

Advertisement
Update:2015-12-26 07:14 IST

బెజవాడలో మరోసారి పొలిటికల్ వార్ మొదలైంది. దేవినేని నెహ్రుపై వంగవీటి రాధా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వంగవీటి రంగా 27వ వర్థంతి సందర్భంగా విజయవాడలో నివాళులర్పించిన ఆయన రాధా మీడియాతో మాట్లాడారు. దేవినేని నెహ్రుపై నేరుగా విరుచుకుపడ్డారు. చనిపోయిన తన తండ్రిపై 20 హత్య కేసులున్నాయంటూ దేవినేని నెహ్రు పిచ్చివాగుడు వాగుతున్నాడని అన్నారు. చనిపోయిన వారిపై ఆరోపణలు చేయడం హీరోయిజం అనుకుంటున్నావా అని ప్రశ్నించారు.

Click to Read: ఆ బూతు ముందు… ఈ బూతు ఎంత అధ్యక్షా..!

”ముళ్లకంపలా అడ్డు ఉంటే తీసేస్తా, నరికేస్తా అంటున్నావ్… ఎంత మందిని తీసేస్తావ్, ఎంత మందిని నరుకుతావ్” అంటూ రాధా మండిపడ్డారు. తమ మౌనాన్ని చేతగాని తనంగా తీసుకోవద్దని హెచ్చరించారు. తాము ఇప్పటికే చాలా నష్టపోయామని… మరోసారి నష్టపోయేందుకు కూడా సిద్ధమని సవాల్ విసిరారు. పిచ్చిమాటలు మానుకో అని నెహ్రుకు వార్నింగ్ ఇచ్చారు. తన తండ్రిపై లేనిపోని వ్యాఖ్యలు చేస్తే సహించే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. నెహ్రును ఉద్దేశించి రాధా ఈ స్థాయిలో వ్యాఖ్యలు చేయడంతో బెజవాడ రాజకీయాలు మరోసారి హీట్ ఎక్కాయి. అయితే ఇరుపక్షాలు సంయమనంతో వ్యవహరించాల్సిన అవసరం ఉందని సీనియర్ నేతలు సూచిస్తున్నారు.

Click to Read: వేయండి వేటు… తీయండి ఆ రెండు వ్యూహాలు

Tags:    
Advertisement

Similar News