పెళ్లి పత్రికలు అందిస్తున్న అసిన్

తన పెళ్లికి సంబంధించి మీడియాకు మాత్రం ఎలాంటి సమాచారం ఇవ్వని అసిన్…. తన ఫ్రెండ్స్ ను మాత్రం పెళ్లికి పిలవడంలో బిజీ అయిపోయింది. తను వచ్చేనెల 23న పెళ్లాడబోతోందనే విషయం మీడియా ఎప్పుడో బయటపెట్టింది. కానీ పెళ్లి పత్రికలు అచ్చు వేయించిన తర్వాత కూడా అసిన్ ఆ విషయాన్ని చెప్పకపోవడం బాధాకరం. మరోవైపు వెడ్డింగ్ కార్డ్స్ తీసుకొని బాలీవుడ్ లో తనకు బాగా క్లోజ్ అయిన సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్, సోనాక్షి సిన్హా, […]

Advertisement
Update:2015-12-26 00:34 IST
తన పెళ్లికి సంబంధించి మీడియాకు మాత్రం ఎలాంటి సమాచారం ఇవ్వని అసిన్…. తన ఫ్రెండ్స్ ను మాత్రం పెళ్లికి పిలవడంలో బిజీ అయిపోయింది. తను వచ్చేనెల 23న పెళ్లాడబోతోందనే విషయం మీడియా ఎప్పుడో బయటపెట్టింది. కానీ పెళ్లి పత్రికలు అచ్చు వేయించిన తర్వాత కూడా అసిన్ ఆ విషయాన్ని చెప్పకపోవడం బాధాకరం. మరోవైపు వెడ్డింగ్ కార్డ్స్ తీసుకొని బాలీవుడ్ లో తనకు బాగా క్లోజ్ అయిన సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్, సోనాక్షి సిన్హా, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, జెనీలియా, బిపాసా బసు…లాంటి తారలను వ్యక్తిగతంగా ఆహ్వానిస్తోంది. మైక్రోమ్యాక్స్ సిఈవో రాహుల్ శర్మను జనవరి 23న ఢిల్లీలో పెళ్లాడనుంది అసిన్. ఆ తర్వాతి రోజు మంబయిలో బాలీవుడ్-టాలీవుడ్ ప్రముఖులకు రిసెప్షన్ ఎరేంజ్ చేస్తున్నారు. టాలీవుడ్ లో ఆమె ఇప్పటివరకు ఎవరికీ ఆహ్వానాలు అందించలేదు. త్వరలోనే శుభలేఖలు పట్టుకొని హైదరాబాద్ లో ల్యాండ్ అయ్యే అవకాశముంది. కనీసం అప్పుడైనా తన పెళ్లి కబురును అధికారికంగా ప్రకటిస్తుందేమో చూడాలి.
Tags:    
Advertisement

Similar News