చంద్రబాబు అనుభవమే నెగ్గింది
చంద్రబాబు అనుభవమే నెగ్గింది. కాల్‌మనీ ఉదంతంలో మొదట్లో తడబడినా చివరకు అధికార పార్టీ సమర్థవంతంగా గట్టెక్కేసింది. కాల్‌మనీలో టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల హస్తమున్నట్టు భారీగా ఆరోపణలు వచ్చాయి. అదే సమయంలో అసెంబ్లీ సమావేశాలు రావడంతో అధికారపార్టీకి తిప్పలు తప్పవని అంతా భావించారు. కానీ చంద్రబాబు వేసిన ఎత్తులకు ఆ అభిప్రాయాలన్నీ చిత్తైపోయాయి. కాల్‌మనీపై ప్రభుత్వాన్ని అసెంబ్లీలో కడిగేయాలనుకున్న ప్రతిపక్షం చివరకు తానే బాయ్‌కాట్ చేసి బయటకు రావాల్సిన పరిస్థితిని సృష్టించడంలో అధికార పార్టీ విజయం సాధించింది. ఇప్పుడు […]
చంద్రబాబు అనుభవమే నెగ్గింది. కాల్‌మనీ ఉదంతంలో మొదట్లో తడబడినా చివరకు అధికార పార్టీ సమర్థవంతంగా గట్టెక్కేసింది. కాల్‌మనీలో టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల హస్తమున్నట్టు భారీగా ఆరోపణలు వచ్చాయి. అదే సమయంలో అసెంబ్లీ సమావేశాలు రావడంతో అధికారపార్టీకి తిప్పలు తప్పవని అంతా భావించారు. కానీ చంద్రబాబు వేసిన ఎత్తులకు ఆ అభిప్రాయాలన్నీ చిత్తైపోయాయి. కాల్‌మనీపై ప్రభుత్వాన్ని అసెంబ్లీలో కడిగేయాలనుకున్న ప్రతిపక్షం చివరకు తానే బాయ్‌కాట్ చేసి బయటకు రావాల్సిన పరిస్థితిని సృష్టించడంలో అధికార పార్టీ విజయం సాధించింది. ఇప్పుడు కాల్‌మనీ గురించి మాట్లాడేవారే లేదు. మీడియా కూడా తీవ్రమైన కాల్‌మనీ కంటే వైసీపీ సభ్యులు అసెంబ్లీలో తిట్టిన తిట్లపైనే ఎక్కువగా చర్చిస్తోంది. ఇదంతా చంద్రబాబు రాజనీతి మహిమేనని చెప్పక తప్పుదు.
Click to Read: ఆ బూతు ముందు… ఈ బూతు ఎంత అధ్యక్షా..!
తెలంగాణలో ఏ చిన్న సంఘటన జరిగినా ప్రజాసంఘాలు తీవ్రంగా స్పందిస్తుంటాయి. కానీ ఏపీలో జరుగుతున్న ఘటనలపై మేధావులుగానీ, సంఘాలు గానీ పెద్దగా స్పందించినట్టు కనిపించలేదు.కొందరు స్పందించినా అవి టీవీల్లో కనిపించలేదు. ఇలా ఎక్కడికక్కడ కాల్‌మనీ నష్టనివారణలో టీడీపీ ప్రభుత్వం చాలా సమర్థవంతంగానే పనిచేసింది. ఎంతంటి సమస్య వచ్చినా ఏరు దాటేస్తామన్న ధీమా ఇప్పుడు టీడీపీలో కనిపిస్తోంది. మొత్తం మీద సంచలనం సృష్టించిన కాల్‌మనీ ఇప్పుడు ముగిసిన అధ్యాయం అయిపోయింది. అయినా చంద్రబాబు అనుభవం ముందు ఇలాంటి సమస్యలు ఎంత?.