ఆ బూతు ముందు... ఈ బూతు ఎంత అధ్యక్షా..!

అసెంబ్లీలో రోజా బూతులు మాట్లాడారు కాబట్టి ఆమెను ఏడాది పాటు సస్పెండ్ చేశామన్నది ప్రభుత్వ వాదన. బాగానే ఉంది రోజా చంద్రబాబును ”కామ సీఎం” అనడం తప్పే!. ఆమెపై ఏడాది పాటు సస్పెన్షన్‌ వేటువేయడం సరైనదా కాదా అన్నది కాసేపు పక్కన పెడితే!. ప్రభుత్వ చీఫ్‌ విప్ కాల్వ శ్రీనివాసులు విడుదల చేసిన వీడియో దృశ్యాలనే పరిశీలిస్తే ప్రభుత్వం పక్షపాతం చూపిందా అనిపించకమానదు. ఎందుకంటే ”కామ సీఎం చంద్రబాబు, సెక్స్‌రాకెట్ సీఎం చంద్రబాబు” అని రోజా నినాదాలు […]

Advertisement
Update:2015-12-25 02:30 IST

అసెంబ్లీలో రోజా బూతులు మాట్లాడారు కాబట్టి ఆమెను ఏడాది పాటు సస్పెండ్ చేశామన్నది ప్రభుత్వ వాదన. బాగానే ఉంది రోజా చంద్రబాబును ”కామ సీఎం” అనడం తప్పే!. ఆమెపై ఏడాది పాటు సస్పెన్షన్‌ వేటువేయడం సరైనదా కాదా అన్నది కాసేపు పక్కన పెడితే!. ప్రభుత్వ చీఫ్‌ విప్ కాల్వ శ్రీనివాసులు విడుదల చేసిన వీడియో దృశ్యాలనే పరిశీలిస్తే ప్రభుత్వం పక్షపాతం చూపిందా అనిపించకమానదు. ఎందుకంటే ”కామ సీఎం చంద్రబాబు, సెక్స్‌రాకెట్ సీఎం చంద్రబాబు” అని రోజా నినాదాలు చేశారు. ఎమ్మెల్యే అనితను ఉద్దేశించి కొన్ని తీవ్రమైన వ్యాఖ్యలే చేశారు.

జనం కూడా రోజా ఒక్కరే బూతులు తిట్టారు అనుకున్నారు. కానీ ప్రభుత్వం విడుదల చేసిన దృశ్యాల్లోనే రోజాను మించి వంద రెట్ల తీవ్రతతో కొడాలి నాని బూతులు తిట్టారు. కొడాలి ఎమన్నారంటే ” వాడు సైకో, కుక్కులా మొరుగుతున్నాడు. అచ్చెన్నాయుడు ఒక సైకో, ఎద్దులా పెరిగాడు గానీ వాడికి బుద్ధి లేదు. సెక్స్‌ రాకెట్ చేసి సిగ్గులేకుండా మాట్లాడుతున్నారు. సిగ్గులేని ముఖ్యమంత్రి. ఎన్టీఆర్‌ను చంపిన యదవలు సార్‌ వీళ్లు. వీళ్లు మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రికి సిగ్గుండాలి. సైకో గాళ్లు” అంటూ కొడాలి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

రోజా తిట్టిన తిట్లు మాత్రమే వింటే ఆమె మాటల తీవ్రత అధికంగానే ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ కొడాలి మాటలతో పోల్చి చూసినప్పుడు రోజా వ్యాఖ్యల తీవ్రత చాలా తక్కువే. పైగా అధికారపక్షం వైపు నుంచి కూడా డీటీఎస్‌ బద్ధలయ్యే రేంజ్‌లో బూతు బాణాలు వచ్చాయని వైసీపీ సభ్యులూ ఆరోపిస్తున్నారు. జనానికి ఎలాగో ప్రజాప్రతినిధుల బూతులు వినడం తప్పడం లేదు కాబట్టి అధికార పార్టీ బూతులను కూడా బయటకు వదిలితే బాగుంటుంది. అటు కొడాలి నాని, ఇటు అధికారపక్షం బూతులు మాట్లాడినా ఒక్క రోజాపైనే వేటు వేయడం ఏమిటో?. రోజా కన్నా తీవ్రంగా తిట్టిన కొడాలిపై ఎందుకు చర్యలు తీసుకోలేదు?.. రోజా మహిళ కాబట్టి వేటు వేశారా?. కొడాలితో గొడవెందుకని వదిలేశారా?. రోజాలో రెడ్డమ్మ లక్షణాలు కనిపిస్తున్నాయని కాల్వ శ్రీనివాసులు అన్నారు. మరి ఆ కోణంలో ఆమెను టార్గెట్ చేశారా?. ఏమో గౌరవనీయులైన పెద్దలకే తెలియాలి. ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు వస్తాయని ఆశించడం కూడా ఆత్యాశే!.

Tags:    
Advertisement

Similar News