నాకు తెలియదు... కాల్వ అలా అనకూడదు.. కమిటీ వేస్తా
అసెంబ్లీలో జరిగిన రచ్చపై స్పీకర్ కోడెల శివప్రసాదరావు ప్రెస్‌మీట్ పెట్టి స్పందించారు. అసెంబ్లీలోని దృశ్యాలు సోషల్ మీడియాకు ఎలా లీక్ అయ్యాయో తనకు తెలియదని చెప్పారు. ఈనెల 18న జరిగిన ప్రొసీడింగ్స్ ఇవ్వాలని వైసీపీ అడిగిందని చెప్పారు. అయితే ఏ పక్షానికి ప్రొసీడింగ్స్ ఇవ్వొద్దని సెక్రటరీని ఆదేశించానన్నారు. దురదృష్టం కొద్దీ సోషల్ మీడియాలో క్లిప్పింగులు ముందే వచ్చాయన్నారు. అది ఎలా జరిగిందన్న దానిపై విచారణ చేస్తామన్నారు. ఫోన్లు, ఐపాడ్ ద్వారా రికార్డయిన దృశ్యాలు లీక్ అయి ఉండవచ్చన్నారు. […]
అసెంబ్లీలో జరిగిన రచ్చపై స్పీకర్ కోడెల శివప్రసాదరావు ప్రెస్‌మీట్ పెట్టి స్పందించారు. అసెంబ్లీలోని దృశ్యాలు సోషల్ మీడియాకు ఎలా లీక్ అయ్యాయో తనకు తెలియదని చెప్పారు. ఈనెల 18న జరిగిన ప్రొసీడింగ్స్ ఇవ్వాలని వైసీపీ అడిగిందని చెప్పారు. అయితే ఏ పక్షానికి ప్రొసీడింగ్స్ ఇవ్వొద్దని సెక్రటరీని ఆదేశించానన్నారు. దురదృష్టం కొద్దీ సోషల్ మీడియాలో క్లిప్పింగులు ముందే వచ్చాయన్నారు. అది ఎలా జరిగిందన్న దానిపై విచారణ చేస్తామన్నారు. ఫోన్లు, ఐపాడ్ ద్వారా రికార్డయిన దృశ్యాలు లీక్ అయి ఉండవచ్చన్నారు. బుధవారం సీడీలను విడుదల చేశామన్నారు. అన్ని పార్టీలు తీసుకెళ్లాయని చెప్పారు. అయితే వాటిని రహస్యంగా ఉంచాలా లేక బహిర్గతం చేయాలా అన్నది వారి ఇష్టమన్నారు. క్లిప్పింగులు విడుదల చేయమని తాను ఎవరికీ చెప్పలేదని కోడెల చెప్పారు. స్పీకర్ అనుమతితోనే క్లిప్పింగ్స్ విడుదల చేస్తున్నామని కాల్వ శ్రీనివాస్ చెప్పడం సరికాదన్నారు.
రోజాను ఏడాది పాటు సస్పెండ్ చేయడం ఎక్కువా లేక తక్కువా అన్న విషయం తేల్చాల్సి ఉందన్నారు. సభలో జరిగిన మొత్తం అంశాలపై డిప్యూటీ స్పీకర్ నేతృత్వంలో ఒక కమిటీ వేస్తున్నట్టు కోడెల ప్రకటించారు. కమిటీలో మూడు పార్టీల నుంచి ముగ్గురు సభ్యులుంటారని చెప్పారు. స్పీకర్‌గా తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్న విషయం గుర్తుందని… స్పీకర్‌గా నిష్పక్షపాతంగా ఉంటానని అన్నారు.