బాలయ్యనూ లాగిన జగన్

లోటస్‌పాండ్‌లో ప్రెస్‌మీట్ పెట్టి ప్రభుత్వాన్ని నిలదీసిన జగన్ పనిలోపనిగా బాలకృష్ణ, గల్లా జయదేవ్‌ల అంశాన్ని లేవనెత్తారు. బంధువులు, సన్నిహితులకు అప్పనంగా భూములు కట్టబెడుతున్నారని ఆరోపించారు. బాలకృష్ణ వియంకుడికి  రూ. 250 కోట్ల విలువైన దాదాపు ఐదు వందల ఎకరాల భూమిని కేవలం రూ. 4. 95 కోట్లకు కట్టబెట్టడం ఏమిటని ప్రశ్నించారు. జగ్గయ్యపేట సమీపంలో కృష్ణానది ఒడ్డున కేవలం ఎకరా లక్ష రూపాయలకే ఇలా కట్టబెట్టారన్నారు. గతంలో ఈ భూమిని తక్కువ ధరకు ఇచ్చేందుకు అప్పటి ముఖ్యమంత్రి […]

Advertisement
Update:2015-12-23 08:57 IST

లోటస్‌పాండ్‌లో ప్రెస్‌మీట్ పెట్టి ప్రభుత్వాన్ని నిలదీసిన జగన్ పనిలోపనిగా బాలకృష్ణ, గల్లా జయదేవ్‌ల అంశాన్ని లేవనెత్తారు. బంధువులు, సన్నిహితులకు అప్పనంగా భూములు కట్టబెడుతున్నారని ఆరోపించారు. బాలకృష్ణ వియంకుడికి రూ. 250 కోట్ల విలువైన దాదాపు ఐదు వందల ఎకరాల భూమిని కేవలం రూ. 4. 95 కోట్లకు కట్టబెట్టడం ఏమిటని ప్రశ్నించారు. జగ్గయ్యపేట సమీపంలో కృష్ణానది ఒడ్డున కేవలం ఎకరా లక్ష రూపాయలకే ఇలా కట్టబెట్టారన్నారు. గతంలో ఈ భూమిని తక్కువ ధరకు ఇచ్చేందుకు అప్పటి ముఖ్యమంత్రి వ్యతిరేకించిన విషయాన్ని జగన్ గుర్తు చేశారు.click to read:చిలకలూరిపేటలో జగన్‌, హరికృష్ణ మీట్‌…

CLICK TO READ: రామోజీ… ఇన్ని మార్పులకు కారణం..

అలాగే రేణిగుంట విమానాశ్రయానికి దగ్గరలో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌ కంపెనీకి 22 ఎకరాల భూమిని అతితక్కువ ధరకు కట్టబెట్టారని అన్నారు. ఎకరం రెండు కోట్లు పలుకుతున్న చోట కేవలం 22. 50 లక్షలకే భూమిని గల్లా కంపెనీకి అప్పగించడాన్ని ఏమనుకోవాలని ప్రశ్నించారు. విశాఖ మధురవాడలో ఎకరా భూమి రూ.10 కోట్లు పలుకుతుండగా… కేవలం రూ. 50 లక్షలకు ఏపీఐఐసీ ద్వారా బినామీలకు అప్పగించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. సింగపూర్ కంపెనీలకు 99 ఏళ్లకు మూడువేల ఎకరాలను లీజుకు ఇస్తున్నారని ఆరోపించారు.

Tags:    
Advertisement

Similar News