రెడ్డమ్మ‌ లక్షణాలపై కాల్వ కామెంట్స్‌

అసెంబ్లీ లోపల జరిగిన సన్నివేశాల వీడియో టేపులను విడుదల చేసిన చీఫ్ విప్ కాల్వ శ్రీనివాస్ … రోజాపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రోజాలో రెడ్డమ్మ లక్షణాలు కనిపిస్తున్నాయన్నారు. రోజాను జగన్ తన చెల్లి అంటున్నారని… శూర్పణక వల్ల రావణాసుడికి పట్టిన గతే జగన్‌కు పడుతుందని విమర్శించారు. అంతే కాకుండా చెవిరెడ్డి స్వామి మాల వేసి కూడా అసభ్యకరమైన పదాలు వాడడం చూస్తుంటే కసాయివాడు కాషాయ దుస్తులు వేసుకున్నట్టుగా ఉందని కాల్వ విమర్శించారు. అయితే రోజాను కాల్వ […]

;

Advertisement
Update:2015-12-23 16:29 IST
రెడ్డమ్మ‌ లక్షణాలపై కాల్వ కామెంట్స్‌
  • whatsapp icon

అసెంబ్లీ లోపల జరిగిన సన్నివేశాల వీడియో టేపులను విడుదల చేసిన చీఫ్ విప్ కాల్వ శ్రీనివాస్ … రోజాపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రోజాలో రెడ్డమ్మ లక్షణాలు కనిపిస్తున్నాయన్నారు. రోజాను జగన్ తన చెల్లి అంటున్నారని… శూర్పణక వల్ల రావణాసుడికి పట్టిన గతే జగన్‌కు పడుతుందని విమర్శించారు. అంతే కాకుండా చెవిరెడ్డి స్వామి మాల వేసి కూడా అసభ్యకరమైన పదాలు వాడడం చూస్తుంటే కసాయివాడు కాషాయ దుస్తులు వేసుకున్నట్టుగా ఉందని కాల్వ విమర్శించారు. అయితే రోజాను కాల్వ విమర్శించడం వరకు బాగానే ఉన్నా… రెడ్డమ్మ లక్షణాలు అంటూ ఒక సామాజికవర్గం మహిళలను కించపరిచేలా ప్రభుత్వ చీఫ్‌ విప్ హోదాలో ఆయన మాట్లాడడం వివాదాస్పదమవుతోంది. కసాయి సామాజికవర్గాన్ని కించపరిచేలా కాల్వ మాట్లాడడాన్ని కూడా పలువురు తప్పుపడుతున్నారు..click to read: అప్పుడే అందిన యాగఫలం…

Tags:    
Advertisement

Similar News