జగన్‌ చేతిలో ఫోటోపై తమ్ముళ్లలో అనుమానాలు

కాల్‌మనీ అంశంపై టీడీపీని బాగా ఇబ్బంది పెట్టింది ఫోటోలు. విద్యుత్ శాఖ డీఈతో చంద్రబాబు, ఇంటెలిజెన్స్ డీజీ వెంకటేశ్వరరావు, ఇతర నిందితులతో టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న ఫోటోలకు విపక్ష వైసీపీ బాగా ప్రచారం కల్పించింది. అసెంబ్లీలో జగన్ పదేపదే ఈ ఫోటోలను ప్రదర్శించారు. అయితే ఈ ఫోటోలు సాక్షి మీడియాకు, జగన్‌ చేతికి ఎలా వచ్చాయన్న దానిపై కృష్ణా జిల్లా టీడీపీ నేతలు కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కృష్ణాజిల్లాకు చెందిన ఇద్దరు టీడీపీ కీలక నేతలే […]

Advertisement
Update:2015-12-22 06:44 IST

కాల్‌మనీ అంశంపై టీడీపీని బాగా ఇబ్బంది పెట్టింది ఫోటోలు. విద్యుత్ శాఖ డీఈతో చంద్రబాబు, ఇంటెలిజెన్స్ డీజీ వెంకటేశ్వరరావు, ఇతర నిందితులతో టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న ఫోటోలకు విపక్ష వైసీపీ బాగా ప్రచారం కల్పించింది. అసెంబ్లీలో జగన్ పదేపదే ఈ ఫోటోలను ప్రదర్శించారు. అయితే ఈ ఫోటోలు సాక్షి మీడియాకు, జగన్‌ చేతికి ఎలా వచ్చాయన్న దానిపై కృష్ణా జిల్లా టీడీపీ నేతలు కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కృష్ణాజిల్లాకు చెందిన ఇద్దరు టీడీపీ కీలక నేతలే … అదే జిల్లాకు చెందిన వైసీపీ ప్రజాప్రతినిధి ద్వారా జగన్‌కు పంపించారని అధికార పార్టీ ఎమ్మెల్యేలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

కాల్‌మనీ ముఠా కీలక సభ్యుడు యలమంచలి రాముతో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ను దిగిన ఫోటోను కూడా జగన్‌కు టీడీపీ నేతలే చేరవేశారట. అయితే గద్దె రామ్మోహన్ ఫోటో దిగిన స్థలం ఎక్కడన్న దానిపై మాత్రం వైసీపీ నేతలకు ఫోటోలు ఇచ్చిన వ్యక్తి వివరించలేదని తెలుస్తోంది. అందుకే అసెంబ్లీలో గద్దె రామ్మోహన్‌కు సంబంధించిన ఫోటోను చూపెడుతూ ఇది బోడె ప్రసాద్‌ గెస్ట్‌ హౌజ్‌లో దిగిన ఫోటో అని జగన్ అన్నారు. కానీ అందుకు గద్దె రామ్మోహన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒక హోటల్ ప్రారంభోత్సవ సమయంలో దిగిన ఫోటో అది అని వివరణ ఇచ్చారు. ఎక్కడ దిగినా ఫోటో మాత్రం అసలైనదే కావడంతో టీడీపీ నేతలు పెద్దగా కౌంటర్ చేయలేకపోయారు. click to read: ఏ మహిళా కావాలని భర్తను వదులుకోదు- ఎమ్మెల్యే కంటతడి

click to read: చంద్రబాబు ఆగ్రహంలోనూ అర్థముంది….

జిల్లాలో తమ హవాను దెబ్బతీసేందుకు పార్టీలోని ఇద్దరు నాయకులు ఈ ఎత్తు వేశారని కాల్‌మనీలో మాటలు పడ్డ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఈ విషయాన్ని చంద్రబాబుకు చేరవేశారని చెబుతున్నారు. అయితే ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేరన్నట్టు కొందరిపై అనుమానం ఉన్నా, నిరూపించేందుకు సాక్ష్యాలు లేవు. దీంతో అసలు విషయం తెలిసినా నాయకత్వం సైలెంట్‌గానే ఉందని చెబుతున్నారు. అయితే తమకు దెబ్బ కొట్టిన వారిపై ప్రతికారం తీర్చుకుంటామని సన్నిహితుల వద్ద మరో వర్గం నేతలు చెబుతున్నారట. ఇలా దెబ్బకు దెబ్బ ఎత్తుగడను ఫాలో అయితే చివరకు పార్టీ నష్టపోతుందని కృష్ణా జిల్లా టీడీపీ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు.

Tags:    
Advertisement

Similar News